Breaking News

13/09/2019

జిల్లా కలెక్టర్ ను సన్మానించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

పెద్దపల్లి ,సెప్టెంబర్ 13 (way2newstv.in)
జిల్లాలో దోమ కాటు వ్యాధులను తగ్గు ముఖం పట్టించడంలో మంచి కృషి చేసి  సఫలీకృతలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనను  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాత్యులు  ఈటెల రాజేందర్ శుక్రవారంగోదావరిఖని ఎరియా ఆసుపత్రి వద్ద సన్మానించారు.  స్వచ్చ్ సర్వెక్షణ్, స్వచ్చ్ సుందర్ సౌచాలయ్ లో జిల్లాకు రెండు సార్లు  జాతీయస్థాయిలో గుర్తింపు లభించడంలో  కలెక్టర్  కృషిఅభినందనీయమని,  
జిల్లా కలెక్టర్ ను సన్మానించిన  రాష్ట్ర  వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు, ఇంకుడగుంతలు నిర్మించడం వల్ల మురికి కాల్వలను పూర్తి స్థాయిలో నిర్మూలించడంలో  పెద్దపల్లి జిల్లా సఫలీకృతమైనందుకు మంత్రిఅభినందిస్తూ, దీని కోసం కృషి చేసిన  ప్రజాప్రతినిధులు, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసారు.  పెద్దపల్లిలో నిర్వహిస్తున్న స్వచ్చత కార్యక్రమాల వల్ల జిల్లా కలెక్టర్  ఇటీవల స్వీడన్ లోనిర్వహించిన  అంతర్జాతీయ నీటి సదస్సులో సైతం పాల్గోన్నారని మంత్రి గుర్తు చేస్తు జిల్లా కలెక్టర్ కు శాలువా కప్పి సన్మానించారు.

No comments:

Post a Comment