Breaking News

13/09/2019

జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభాపతి

కామారెడ్డి సెప్టెంబర్ 13 (way2newstv.in)
కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ  పట్టణంలో  ప్రభుత్వ బాలుర మరియు బాలికల జూనియర్ కళాశాలలో రూ. 2.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులకు, ఆడిటోరియంకు  శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దేవాలయాలు ఎలా ఉంటాయో విద్యాలయాలు కూడా అలానే ఉండాలి. గుడి కట్టడానికిచిత్తశుద్ధి ఎంత ముఖ్యమో బడి కట్టడానికి అంతే అవసరం అని అన్నారు.  రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో 1.70 లక్షల మంది ఉపాద్యాయులుగా ఉన్నారు అనిఅన్నారు.  
జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభాపతి

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ శాఖ తర్వాత విద్యాశాఖకే అత్యధిక నిధులు కేటాయిస్తుంది అని అన్నారు.  ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చెసే అధికారం ఎవరికీ లేదు , తమస్వంత ఇంటిని ఏ విదంగా నాణ్యంగా కట్టుకుంటామో, విద్యాలయాలను కూడా అంతే నాణ్యతతో 100 ఏళ్ళు ఉండే విదంగా నిర్మించాలి అని అన్నారు.  ప్రవేటు, కార్పొరేట్ విద్యాలయాల విద్యార్థులేకాదు ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉద్యోగాలు సాదించాలి అని అన్నారు.  ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన వసతులు, సౌకర్యాలనుకల్పించగలదు. కాని వారిని అద్భుతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాద్యాయులదే అని ఎద్దేవా చేశారు .  విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం , గురువులను గౌరవించడం ఎంతో ముఖ్యంఅని అన్నారు.  విద్యార్థుల భవిష్యత్తు బాగునప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజేశ్వర్, జూనియర్ కళాశాల అధ్యాపక బృందంస్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment