Breaking News

11/09/2019

విజ‌య్ `బిగిల్‌` తెలుగు హక్కుల‌ను ద‌క్కించుకున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా `రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన `తెరి`(పోలీస్‌),`మెర్స‌ల్‌`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా `బిగిల్‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గాన‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌లచేస్తున్నారు. 
విజ‌య్ `బిగిల్‌` తెలుగు హక్కుల‌ను ద‌క్కించుకున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

ఈ సంద‌ర్భంగానిర్మాత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ - ```బిగిల్‌` సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్థ్యాంక్స్‌.  `118`తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీక్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే  తెలుగు టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.న‌టీన‌టులు: విజ‌య్‌, న‌య‌న‌తార‌, వివేక్‌, జాకీ ష్రాఫ్‌, డేనియ‌ల్ బాలాజీ, అనంత్‌రాజ్ త‌దిత‌రులు

No comments:

Post a Comment