Breaking News

11/09/2019

ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ

అమరావతి సెప్టెంబర్ 11,(way2newstv.in):
రాష్ట్రంలో స్కూళ్లను అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ ప్రతి మండలానికీ జూనియర్ కాలేజీ ఉండాలి. ఆమేరకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధంచేయండి. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టూ వరకూ పెంచాలన్న సూచించారు. జూనియర్ కాలేజీ స్థాయికి వీటిని తీసుకు వెళ్లాలన్న సీఎంఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ ప్రాంతాల్లో చేయాలన్నదానిపై ఒక ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక వేయాలని అయన అన్నారు. 
ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ

స్కూళ్ల తరహాలోనే కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్, సోషల్, బీసీ వెల్ఫేర్ ఇలా అన్ని శాఖలకు చెందిన స్కూళ్లు కూడా ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. తొలిదశలో టార్గెట్ పెరిగినా పర్వాలేదన్న ఏ  స్కూల్ తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తికావాలని అన్నారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, దాంట్లో రాజీపడవద్దని స్పష్టంచేసారు. మార్చి 14, 2020 నాటికి నాడు–నేడు కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తిచేస్తామని  అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్ ఉండేలా చూడాలని  సీఎం అన్నారు. విద్యా కమిటీలు సామాజిక తనిఖీ చేయాలి. స్కూళ్ల బాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ సీఎం దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు. డైట్స్లో ఇంగ్లిషు బోధనపై శిక్షణ ఇచ్చేలా, డైట్స్ను బలోపేతం చేసేలా ఒక ఆలోచన చేయాలి. టీచర్లకు ఇచ్చిన శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అయన అన్నారు.

No comments:

Post a Comment