Breaking News

04/09/2019

బీసీ కాలేజీ హాస్టల్ లో సీట్లు పెంచాలి

హైదరాబాద్ సెప్టెంబర్ 4   (way2newstv.in)
బీసీ కాలేజీ హాస్టల్ లో సీట్లు పెంచి దరఖాస్తు చేసిన ప్రతి బి.సి విద్యార్ధికి హాస్టల్ సీటు ఇవ్వాలని, హాస్టళ్ళలో వసతి సౌకర్యాలు మెరుగు పర్చలని, హాస్టళ్ళకు అన్ని వసతులు గల భవనాలు తీసుకోవాలని, అదనంగా నగరంలో 100 బీసీ కాలేజీ హాస్టల్ లో మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జంటనగరాల కాలేజీలకు చెందిన బిసి విద్యార్థులను జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ  ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు G.అంజి, ప్రధాన కార్యదర్శి ర్యాగ చంద్రశేఖర్ గౌడ్ ఈ ముట్టడికి నాయకత్వం వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి హాస్టల్ సీట్లు ఇచ్చే వరకు కదిలేది లేదని ఆఫీసులో బైఠాయించారు. 
బీసీ కాలేజీ హాస్టల్ లో సీట్లు పెంచాలి

డిగ్రీ కోర్సులు తరగతులు ప్రారంభమయ్యాయి. ఒక నెల గడుస్తున్నా విద్యార్థులు హాస్టల్ వసతి లేక తరగతులకు హాజరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సీటు ఇస్తారా! చదువు మానుకోవాలా! అంటూ విద్యార్థులు అధికారులను నిలదీశారు. పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఒక డిప్యూటీ డైరెక్టర్ తప్ప అధికారులంతా పారిపోయారు. గుజ్జ కృష్ణ మాట్లాడుతూ కాలేజీ లో ప్రారంభమయ్యి ఈ మూడు నెలలు  కావస్తున్న వస్తుంది. కానీ వేలాది మంది విద్యార్థులకు హాస్టల్ సీటు లభించక కాలేజీలకు వెళ్లడం లేదు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి, పేద కుటుంబాల నుంచి చదువుకుందామని వచ్చిన విద్యార్థులకు హాస్టళ్ళలో సీట్లు లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు హాస్టల్ భవనాలు తీసుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఆఫీసర్లు, భవనాల యజమానులు కుమ్మక్కయి కమీషన్లకు కక్కుర్తిపడి వసతులు లేని పాత భవనాలు తీసుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.బి.సి. హాస్టళ్ళలో విద్యర్దులకు మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. హాస్టళ్ళలలో ఇరుకు గదులలో, ఒక్కో గదిలో 20 నుండి 30 మంది విధ్యార్దులను ఉంచి పందుల కొట్టంలా తయారుచేసారని వీరు మండి పడ్డారు. కొన్ని హాస్టల్ లలో బోజన వసతులు సరిగా లేవని, డైనింగ్ హాల్స్ లేవని, మరి కొన్ని హాస్టల్ లలో నీటి సదుపాయo  సరిగ లేవని వీరు విమర్శించారు. కొంత మంది అదికారులు కమిషన్ల కు కక్కుర్తి  పడి అద్దె భవనాలను మార్చట్లేదని అన్నారు. అన్ని వసతులు గల అద్దె భవనాలలోకి  హాస్టల్ భవనాలను మార్చాలని కోరారు. అలాగే సొంత భవనాలను నిర్మించాలని, లేదంటే వేలాది మంది విద్యార్థులతో ముఖ్య మంత్రి ఇళ్ళను ముట్టడిస్థామని హేచ్చరించారు. 

No comments:

Post a Comment