Breaking News

04/09/2019

ఎల్.రమణ ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి

టీడీపీ అధినేత చంద్రబాబు
హైదరాబాద్ సెప్టెంబర్ 4, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ బుధవారం  పుట్టినరోజు జరుపుకున్నారు.  ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
ఎల్.రమణ ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి

రమణ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.  ఆయన ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

No comments:

Post a Comment