Breaking News

10/09/2019

గ్రేటర్ లో పారిశుధ్యం పై ప్రముఖుల విస్తృత తనిఖీలు

కె.టి.ఆర్ ఆదేశంతో క్షేత్రస్థాయిలో పర్యటించిన మేయర్, డిప్యూటి మేయర్, కమిషనర్, ఉన్నతాధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (way2newstv.in)
 గ్రేటర్ హైదరాబాద్ లో మరింత మెరుగైన పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ చేపట్టేందుకు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకునేడు ఉదయం నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లతో సహా పలువురు అడిషనల్, జోనల్ కమిషనర్లు నేడుతమ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై తనిఖీలు నిర్వహించడంతో పాటు డెంగ్యు కేసులు నమోదైన ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి దోమల ఉత్పత్తి ప్రాంతాలు, నీటి నిల్వలు ఉండే గుంతలు,పాత్రల్లో నీటిని తొలగించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు స్వయంగా తన నివాసంలో ఉన్న పూల మొక్కల కుండీలు, ఇతర ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా ఉండేలా మరోసారి తనిఖీనిర్వహించారు. 
గ్రేటర్ లో పారిశుధ్యం పై ప్రముఖుల విస్తృత తనిఖీలు

 లాలాపేట్ లోని వినోబానగర్ కు నేడు ఉదయం 7గంటలలోపే మేయర్ రామ్మోహన్ చేరుకొని అక్కడి ప్రధాన రహదారుల్లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.వినోబానగర్ లోని స్థానికులతో మాట్లాడుతూ తమ తమ ఇళ్లలోని నీటి నిల్వలను వెంటనే తొలగించుకోవాలని సూచించారు. అనంతరం తార్నాక హెచ్.ఎం.డి. ఏ కార్యాలయం బయట ఉన్న బస్ షెల్టర్ను పరిశీలించి ఇక్కడ బస్సులు సులభంగా వెళ్లడానికి హెచ్.ఎం.డి.ఏ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బస్ బేను నిర్మించాలని జోనల్ కమిషనర్ శంకరయ్యకు సూచించారు. అనంతరం మాణికేశ్వర్ నగర్లో పర్యటించి బస్తీలోని ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాదులపై అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వ ఉండే తొట్టీలు, సంపులు, పాత ట్యాంకులను స్వయంగా పరిశీలించినీటిని తొలగించారు. తమ ఇళ్లలో ఉన్న నీటి నిల్వలలో ఉన్న లార్వాను ఎంటమాలజి సిబ్బంది ద్వారా తీసి వారికి చూపించారు. డెంగ్యు వ్యాధి అనేది తమ తమ ఇళ్లలో ఉన్న నీటి నిల్వలలో వచ్చేదోమల ద్వారా వస్తుందని, ముందుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నీటి నిల్వలను తొలగించాలని స్థానికులకు విజ్జప్తి చేశారు. జ్వరాలన్నీ డెంగ్యు  జ్వరాలు కావని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరుతమ ఇళ్లను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి తొట్లు, పూల మొక్కల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని మేయర్ రామ్మోహన్ విజ్జప్తి చేశారు. డిప్యూటి మేయర్ బాబాఫసియుద్దీన్ ఆర్.సి పురం కార్పొరేటర్ టి.అంజయ్య తో కలిసి రాంచంద్రపురం, ఎస్.ఎన్ కాలనీ, బి.హెచ్.ఇ.ఎల్, గోపనపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగాఇళ్లలో నీటి నిల్వ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి వాటిని తొలగించాల్సిందిగా స్థానికులకు విజ్జప్తి చేశారు. జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కూడా నేడు ఉదయం ట్యాంక్ బండ్, ఇందిరాపార్కుల వద్ద పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఇందిరా పార్కు గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ ను పరిశీలించారు. జిహెచ్ఎంసి ఆరోగ్య విభాగం అడిషనల్ కమిషనర్ సందీప్ జాబన్సిలాల్ పేట్ లోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ దవాఖాన ద్వారా అందిస్తున్న వైద్య పరీక్షలు, ఇతర సేవల గురించి బస్తీ దవాఖానాలకు వచ్చే వారిని అడిగి తెలుసుకున్నారు.జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమతలు తమ ప్రాంతాల్లో నేడు ఉదయం నుండి విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

No comments:

Post a Comment