తిరుపతి, సెప్టెంబర్ 10(way2newstv.in)
ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా రాష్ట్రానికి తిరిగొచ్చారు. టూర్‌లో ఫ్యామిలీతో సరదాగా గడిపిన రోజా.. వచ్చీ రాగానే కుమార్తె బర్త్ వేడుకలతో బిజీ అయ్యారు. సొంతనియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసంలో కుమార్తె అన్షు మాలిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కూతురు బర్త్ డే వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా
బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను వైఎస్సార్‌సీపీకార్యకర్తలు, అభిమానులతో పంచుకున్నారు.రోజా మొన్నటి వరకు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా గడిపారు. కుటుంబంతో కలిసి ఈ టూర్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో ఫ్యామిలీతో కలిసి రోజా ఎంజాయ్చేశారు. తన టూర్ విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకున్నారు. ఎన్‌ఐఆర్‌లు, తెలుగు వాళ్లతో కలిసి రోజా ఫోటోలు దిగారు. ఓ రెస్టారెంట్‌లో సరదాగా గడిపారు.. చివరి రోజు జాలీ రైడ్‌కు వెళ్లారు.
No comments:
Post a Comment