Breaking News

11/09/2019

విజృంభిస్తున్న విషజ్వరాలు

అదిలాబాద్, సెప్టెంబర్ 10 (way2newstv.in)
మంచిర్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, వైరల్‌ ఫీవర్, రక్త కణాల తగ్గింపుతో జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండలం చింతగూడాలో ఇప్పటికీ డెంగీతో ఇద్దరుమృతి చెందగా కన్నెపెల్లి మండల కేంద్రంలో ప్రబలిన విషజ్వరాలతో ఇద్దరు వ్యక్తులు  మృతి చెందారు.. మరో 30 మందికి డెంగ్యూ  లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో  కన్నెపల్లిలో డెంగ్యూ భారిన పడి  10 మంది మృత్యువాత ...దీంతో వైద్య శాఖ అధికారుల  నిర్లక్ష్యం పై గ్రామస్థులు మండిపడుతున్నారు.మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం ఎస్.టీ కాలనీలో వైద్య సౌకర్యం లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేక పోవడంతో  నెలల వ్యవధిలోనే 10 మంది దాకా డెంగ్యూ వ్యాధితో పిట్టల్లా రాలిపోయ్యారు.. మరో పక్క వైద్య శాఖ అధికారులు తూతూ మంత్రంగా క్యాంప్ లు నిర్వహించి వెళ్లిపోతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 
విజృంభిస్తున్న విషజ్వరాలు

ఇటు పారిశుద్ధ్య లోపం అటు త్రాగునీరుకు కూడా వాగు నీరు దిక్కై పోవడం ఇటు గ్రామ పంచాయతీ నిర్వహణ లోపం వీరికి శాపంగా మారింది.. దీంతో ఇక్కడ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.గడిచిన వారం రోజుల నుంచి డెంగ్యూతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. వీరు కూలి పని చేసుకుని బ్రతికే బడుగు జీవులు రెక్కాడితే కానీ డొక్కాడని వీరు తీవ్ర జ్వరంతో మంచాన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేక పోవడంతో ప్రైవేట్ వైద్యం దిక్కయింది. వీరి జ్వర తీవ్రత అధికం కావడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో డెంగీ జ్వరం అని నిర్ధారించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం  కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి రెఫెర్ చేయడంతో  అక్కడ వ్యాధితీవ్రత అధికమై మరణించారు.గత 4 నెలల క్రితం మన్నెవాడా, ఎస్సీ కాలనీ బోయవాడలలో పారిశుద్ధ్య లోపంతో వర్షంతో వాడలన్ని బురదమయంగా మారిపోయి ఈగలు దోమలు వ్యాప్తి చెందాయి. వీటిని అరికట్టడానికి గ్రామ పంచాయితీ కాలువలు నీరు నిలువ ఉన్న ప్రాంతాన్ని  శుభ్రం చేయక పోవడం వైద్య సిబ్బంది క్యాంప్ నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించి వెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి ఊరు ముఖం కూడా చూడ లేదు. దీనిపై అప్పటి కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ సందర్శించి ఆరోగ్య సిబ్బందికి జ్వరాలు తగ్గే వరకు స్థానికంగా ఉండి వైద్యం అందించాలని సూచించినప్పటికి కూడా వైద్యశాఖ నిర్లక్ష్యం వహించడం అన్ని వెరసి మరో 2 ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయి.రోజురోజుకు జ్వర పీడితుల సంఖ్య జిల్లాలో పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు..జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ జ్వరానికి సంబంధించిన చికిత్స అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలిని...  రక్త కణాలు తగ్గిన రోగులకు అని సౌకర్యాలు  ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు..జిల్లా వాసులు కోరుతున్నారు..

No comments:

Post a Comment