Breaking News

16/08/2019

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన గవర్నర్

విజయవాడ ఆగస్టు 13 (way2newstv.in)
ప్రభుత్వ ఆసుపత్రి లోని వివిధ విభాగాలను ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ శుక్రవారం పరిశీలించారు. బ్లాక్ నెంబర్ 3వ వార్డ్లో రోగులను అయన పరామర్శించారు. ఆరోగ్య శ్రీ వార్డ్స్ ఆరేషన్ థియేటర్లు, సర్జికల్ వార్డ్స్, సర్జికల్ ఐ.సి.యూలను గవర్నర్ పరిశీలించి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 
ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన గవర్నర్

డయాలసిస్, అల్ట్రా సౌండ్ విభాగం సైతం పరిశీలించి.. కొన్ని సూచనలు చేసారు. తరువాత అయన పేదలకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వసతులు సంతృప్తినిచ్చాయన్నా గవర్నర్, రోగుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు భేష్ అని కొనియాడారు. 

No comments:

Post a Comment