Breaking News

17/08/2019

భారీగా వరినాట్లు...

కరీంనగర్, ఆగస్టు 17, (way2newstv.in)
కాళేశ్వరం లింక్ 2 పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో శ్రీరాంసాగర్‌కు మంచి రోజులు రానున్నాయి. ఈ సీజన్‌లో శ్రీరాంసాగర్‌కు రోజుకు అర టిఎంసి చొ ప్పున ఎత్తిపోయాలని నిర్ణయించా రు. మరో అర టిఎంసిని మిడ్ మానేరుకు పంపనున్నారు. కాళేశ్వరం లింక్ 2లో ఎల్లంపల్లి నుం చి నంది ( నంది మేడారం ) పం పుహౌజ్ ద్వారా నీటిని ఎత్తిపోస్తే, అది ప్యాకేజి 7 జంట సొరంగాల ద్వారా గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్ ద్వారా నీరు వరద కాలువలోకి చేరుతుంది. ఈ సీజన్‌లో లింక్ 2 ద్వారా రోజుకు 1 టిఎంసిని ఎత్తిపోయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నీరంతా వరద కాలువలోకి చేరుతుంది. వరద కాలువ నుంచి గ్రావిటీతో అర టిఎంసి మిడ్ మానేరుకు చేరుతుంది. 
భారీగా వరినాట్లు...

మరో అర టిఎంసిని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలోని పంపుల ద్వారా రెండు దశల్లో ఎత్తిపోస్తే నీరు పోచంపాడు జలాశయంలోకి వెళుతుందిశ్రీరాంసాగర్‌పై ఆధారపడి 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఈ ఆయకట్టు ఉంది. అయితే లోయర్ మానేరు దిగువన ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం నుంచే నీటిని ఇచ్చి స్థిరీకరించే అవకాశం ఉం డగా, అక్కడి వరకు ఉన్న ఆయకట్టుకు మాత్రం శ్రీరాంసాగర్ నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి తోడు గుత్ప ఎత్తిపోతల, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు సైతం శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ఆశలు కల్పించింది. ఎల్లంపల్లి వర కు నీటిని లింక్ 1 ద్వారా తీసుకువస్తారు. ప్రస్తు తం స్థానిక వర్షాలతో వచ్చిన నీటితో ఎల్లంపల్లి నిండింది. గేట్లు తెరిచి, నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే వర్షాకాలం తర్వాత కూడా ప్రాణహిత నుంచి వచ్చే నీటిని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజి వద్ద ఆగిపోతుంది.ఈ బ్యాక్‌వాటర్‌ను లక్ష్మీ (కన్నెపల్లి) పంపుహౌజ్ వద్ద నుంచి ఎత్తిపోస్తారు. ఈ నీరు అన్నారం వద్ద సరస్వతి బ్యారేజిలోకి వెళుతుంది. ఈ నీటిని సరస్వతి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోస్తే పార్వతి (సుందిళ్ల) బ్యారేజిలోకి వెళుతుంది. పార్వతి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోస్తే ఈ నీరంతా ఎల్లంపల్లి బ్యారేజిలోకి చేరుతుంది. ఎల్లంపల్లి బ్యారేజి లింక్ 1, లింక్ 2లకు అనుసంధానంగా ఉంది. ఇప్పటికే లింక్ 2 నుంచి ఎల్లంపల్లి నీటిని నంది (నంది మేడారం) పంపుహౌజ్, జంట సొరంగాలు, గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్‌లో పంపులు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. నంది పంపుహౌజ్‌లో ఐదు పంపులు విజయవంతంగా వెట్న్ జరుపగా, గాయత్రి పంపుహౌజ్‌లో రెంపడ పంపుల వెట్న్ విజయవంతమైంది.

No comments:

Post a Comment