Breaking News

16/08/2019

దళారీల బారినపడకుండా మత్స్యకారులకు సౌకర్యాలు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి ఆగస్టు 16, (way2newstv.in):
మత్స్యకారులు దళారుల బారినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రం  రిజర్వాయర్లో నూరు శాతం సబ్సిడీపై అందజేసిన చేపపిల్లలను  వదిలారు.ఈ సందర్భంగా మంత్రి మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ  వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, ఉద్యాన, రంగాల ద్వారా రైతులకు, ఆయా కులాల వారికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తునదని అన్నారు. ఇందులో భాగంగానే  మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం నూటికి నూరు శాతం సబ్సిడీపై చేపపిల్లలను రిజర్వాయర్, చెరువులలో వదలడం జరుగుతుందని తెలిపారు .
దళారీల బారినపడకుండా మత్స్యకారులకు సౌకర్యాలు

ఈ సంవత్సరం ఒక్క  వనపర్తి జిల్లాలోనే   252 కోట్ల చేపపిల్లలను రిజర్వాయర్లలో వదులుతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల మత్స్యకార కుటుంబాల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అన్నారు. మత్స్యకారుల కష్టం వారికే దక్కాలన్నా ఉద్దేశంతో మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చేప విత్తనాలు మొదలుకొనిచేపలు పట్టడం, మార్కెటింగ్ వరకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని ముఖ్యంగా, సబ్సిడీపై చేప పిల్లల విత్తనాల పంపిణీ, వలలు, వాహనాలు మినీ మార్కెట్, సదుపాయాలు వంటివి కనిపిస్తున్నదని,మత్స్యకార కుటుంబాలు వీటిని సద్వినియోగం  చేసుకోవాలని కోరారు.మత్స్య కార కుటుంబాలు  బాగుపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యామని, రైతులు పంటలపండించిన విధంగానే పాడి పశువులు,చేపలు,ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు చేపట్టాలని అన్నారు.రంగసముద్రం చెరువు రాయల్టీతగ్గింపు విషయమై గతంలో  మత్స్యకారులు వేసిన కోర్ట్ కేసును ఉపసంహరించుకొని ఇకపై ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లించాలని మంత్రి మత్స్యకార సహకార సంఘాలకు విజ్ఞప్తి చేసారు.రాయల్టీ తగ్గింపు విషయమై వెంటనే రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ కు మాట్లాడారు.ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల కాలువలపై మంత్రి స్పష్టత ఇస్తూ జిల్లాలోని అన్ని ప్రాజక్టుల పరిధిలోని కాలువల పరిమాణం ఉండాల్సినంత లేదని,అందువల్ల ఉధృతమైన వరదలు వచ్చినప్పటికీ రిజర్వాయర్లలో నీటిని నిలువ ఉంచుకోలేక పోతున్నామని మంత్రి తెలిపారు.యెనుకుంట రిజర్వాయర్నుండి రంగసముద్రం వరకు కూడా కాలువల పరిమాణం తక్కువగా ఉన్నందున ఒకేసారి రంగసముద్రం రిజర్వాయర్ నింపుకోలేక పోతున్నామని చెప్పారు.పాత పాలమూరు జిల్లాలోని కాలువల వేడల్పు విషయాన్ని త్వరలో ఉమ్మడి పాలమూరు ప్రాజక్ట్ ల పర్యటనకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు.        కాగా శుక్రవారం రంగసముద్రంలో లక్ష 50 వేల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో   జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పి చైర్మన్ ఆర్.లోకేనాథ్ రెడ్డి,వైస్ చైర్మన్ వామన్ గౌడ్,ఎంపిపి గాయత్రి,జెడ్పిటిసి రాజేంద్ర ప్రసాద్ ,పిఏ సీఎస్,అధ్యక్ష్యులు కోదండరెడ్డి,సర్పంచ్ వినీల రాణి,మాజీ మార్కెట్ కమిటి అధ్యక్ష్యులు బుచారెడ్డి, మత్స్య శాఖ ఎడి రాధ రోహిణి ,తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment