Breaking News

09/08/2019

గోదావరికి అంతకంతకూ పెరుగుతున్న వరద

రాజమహేంద్రవరం ఆగస్టు 9, (way2newstv.in)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నీటిమట్టం 14.6 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే స్థాయిలో వరద ఉద్ధృతి కొనసాగితే ఇవాళ సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరికకు వరద చేరుకునే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు.డెల్టా కాల్వలకు 7700 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 13.97లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.మరోవైపు భద్రాచలం వద్ద కూడా వరద ఉద్ధృతి పెరుగుతోంది. 
గోదావరికి అంతకంతకూ పెరుగుతున్న వరద

నీటిమట్టం 47.9 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేయనున్నారు.జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు కోనసీమలో పలు లంక గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయినవిల్లి మండలం వెదురుబిడుం వద్ద కాజ్వే నీట మునిగింది. పి.గన్నవరం, మామిడికుదురు, అప్పనపల్లి వద్ద కాజ్వేలు మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అద్దంకి వారిలంక, వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక, జిల్లా సరిహద్దులోని అయోధ్యలంక, పుచ్చల్లంక, రాయిలంక, నక్కిడిలంక, పెదమల్లంక, ఆనగార్లలంక గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, జి.పెదపూడి లంకను వరదనీరు చుట్టుముట్టింది. దీంతో ఆయా లంక గ్రామాల ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment