Breaking News

09/08/2019

గోదావరిలో తప్పిన ప్రమాదం

పోలవరం ఆగస్టు 9, (way2newstv.in)
 గోదావరిలో ఘోర ప్రమాదం తప్పింది. వరద ఉద్ధృతికి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 31 మంది మత్య్సకారులు చిక్కుకున్నారు. వీరంతా తాత్కాలికంగా కాఫర్ డ్యాంపైకి చేరుకొని సురక్షితంగా ఉన్నప్పటికీ.. వారిని అక్కడి నుంచి ఒడ్డుకు ఎలా చేర్చాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు తమను రక్షించాలంటూ మత్స్యకారులు ఆర్తనాదాలు చేస్తున్నారు. 
గోదావరిలో తప్పిన ప్రమాదం

వారిని రక్షించేందుకు స్థానికులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమతున్నాయి. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అక్కడికి గజఈతగాళ్లు చేరుకోలేకపోతున్నారు. మరబోట్లు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ధవళేశ్వరానికి చెందిన 31 మంది మత్స్యకారులు 19 పడవల్లో 80 రోజుల క్రితం మరబోట్లతో చేపల వేటకు వెళ్లారు. పది రోజులుగా గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తిరుగు ప్రయాణం పట్టారు. కూనవరం నుంచి ధవళేశ్వరం వెళ్తుండగా.. వీరవరపు లంక సమీపంలోని పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద చిక్కుకున్నారు. నది మధ్యలో చిక్కుకున్న వారిలో 19 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఉదయం నుంచి ఆహారంలేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.

No comments:

Post a Comment