నంద్యాల ఆగస్టు 27, (way2news.in - Swamy Naidu)
నంద్యాల జిల్లా కాబోతున్నదని ఊహాగానాలు వినిపించడముతో. నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేటు భూములు ఓక ఏకర 5 కోట్లు పలుకు తుంటడముతో ఇంటి స్థలాలకు భారీగా డిమాండ్ పెరగడంతో. భూ కబ్జా దారులు . అక్రమ సంపాదన అలవాటు పడ్డ వారు . ఏట్లా అయినా అవినీతి సొమ్ము సంపాదించాలనే ఆలోచనలతో . వక్ఫ్ భూములను ఆక్రమించు కోవాలనే దురుద్దేశం తో. కొందరిని ముస్లిం సోదరులను. రెవెన్యూ అధికారులను. చోట మోట నాయకులను కలుపుకొని పన్నాగం పడినట్లు తెలుస్తోంది . నూనెపల్లె లో గల వక్ఫ్ భూములపై వీరి ద్రుష్టి పడింది . సర్వే నెంబరు 22.47.52. 228.231. 236.239. 275.278.284. సర్వే నెంబర్ ల లో 74 ఎకరాల వక్ఫ్ భూములను రాత్రి కి రాత్రె వక్ఫ్ భూముల రూపు రేఖలు మారి పోయాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని. ఎవరి వాటాలు వారు తీసుకున్నారని పలువురు విమర్శలు వినిపిస్తున్నాయి . ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఇంత అన్యాయం ఎక్కడ జరిగలేదని వాపోయారు .
అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ భూములు
ముస్లిం మైనార్టీ వారి బాగోగులకు గాను గతంలో ప్రభుత్వలు వక్ఫ్ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల కు ఇవ్వద్దు అని ఎన్నో జీవోలు జారీ చేశారని అన్నారు . ఆ భూములు ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం వారి కే చెందుతాయని పదె పదే ప్రకటనల చేస్తూనే వుందన్నారు . గతంలో కొంత మంది ముస్లిం మైనార్టీ వారు వక్ఫ్ భూములను ఇతరులు కొనుగోలు చేస్తున్నారని. మరియు భూ కబ్జాదారులు ఆక్రమించుకొను చున్నారని ధర్నాలు నిరహర దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు ఈ విషయం పై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని . కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం లో జెండాలు పాతి ఈ భూములు వక్ఫ్ బోర్డు కు సంబంధించినవి అని ఎటువంటి లావాదేవీలు నడప కూడదని ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేచిన కూడా. కొందరు వక్ఫ్ బోర్డు అధికారులు ప్రమేయం తో . రాజకీయ నాయకుల ప్రమేయం తో . అవినీతి రెవెన్యూ అధికారుల తో కలసి పన్నిన కుట్రలో భాగంగానే వక్ఫ్ భూములపై వెంచర్లు వేయడం మరియు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఈ అవినీతిని కప్పిపుచ్చు కోవడానికి ఇద్దరి విలేకరులకు కూడా మచ్చిక చేసుకున్నారని వినికిడి. ముస్లిం మైనార్టీ పెద్దల హస్తం తో నే ఈ వ్యవహారం నడుస్తోంది అని కొంతమంది ముస్లిం మైనార్టీ సోదరుల ఆరోపణలు చేస్తున్నారు . ఏది ఏమైనా వక్ఫ్ భూములను కాపాడాలని పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భూ కబ్జా దారులను అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని వారు
డిమాండ్ చేస్తున్నారు .
No comments:
Post a Comment