Breaking News

27/08/2019

మహా ఉద్యమంలా మొక్కలు నాటాలి

ఖమ్మం ఆగస్టు 27, (way2newstv.in - Swamy Naidu)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఐదో విడత హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మహా ఉద్యమంలో మొక్కలు నాటాలని అన్నారుగూడెం గ్రామ సర్పంచి మారెళ్ళ మమత పిలుపునిచ్చారు. మంగళవారం మెగా హరితహారంలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామ సమీపంలో  విరివిగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు నాటితేనే సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. 
మహా ఉద్యమంలా మొక్కలు నాటాలి
జివకోటి మనుగడకు  మొక్కలే ప్రధానమన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం డీ. తాజుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు గోవిందు విజయమ్మ, ఉప సర్పంచి గోవిందు భాగ్యమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తాళ్ల జోసెఫ్, తెరాస నాయకులు పొన్నం కృష్ణయ్య, తుమ్మల పల్లి రమేష్, మారేళ్ల మల్లిఖార్జున రావు, అంగన్ వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment