అన్నవరం,ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu)
తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చిక్కాల.సాయిబాబా లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయాడు. చినశంకర్లపూడి గ్రామానికి చెందిన గాడి.వరప్రసాద్ కు రావాలసిన నలభై వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ,ఫైల్ క్లియరెన్స్ నిమిత్తం ఐదు వేల రూపాయలు లంచంగా అడిగాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రాజమండ్రి ఏసీబీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెరిఫై చేసి , పధకం రూపొందించి ఆధారాల సేకరించి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డి.ఎస్.పి.రామచంద్రరావు తెలిపారు . ,2016 సంవత్సరంలో పుష్కరాలపనులలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ వద్ద షెడ్ నిర్మాణం వరప్రసాద్ చేసారు. దానికి సంబంధించి పనులు పూర్తయ్యి ,బిల్లు చెల్లింపులు కూడా జరిగాయి.
ఏసీబీ అధికారులు వలలో అన్నవరం ఆలయ ఉద్యోగి
అయితే ఆ వర్క్ కు సంబంధించి దేవస్థానం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ గా ఉంచిన నలభూ వేల రూపాయలకు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫైల్ క్లియరెన్స్ చేసి ఆ మొత్తం రావాలంటే ఐదు వేల రూపాయలు తనకు ముట్టజెప్పాలని లేని పక్షంలో కొంత సమయం ఆగాలంటూ తనను డిమాండ్ చేసినట్లు వరప్రసాద్ పిర్యాదు చేశాడు. మధ్యవర్తుల సమక్షంలో పది ఐదు వందల రూపాయలు ఇస్తుండగా దాడి చేసి అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు. ఈ కేసులో తనతో బాటు సీఐ పుల్లారావు .మోహన్ ,తిలక్. , ఎస్సై నరేష్ ,సిబ్బంది పాల్గొన్నారని అన్నారు. ని నిందితుడిని అరెస్ట్ చేసి రేపు రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డి.ఎస్.పి. రామచంద్రరావు తెలిపారు.
No comments:
Post a Comment