మంచిర్యాల ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu)
నిన్నటి నుండి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లలో నిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం నుండి వర్షాలు పడుతుండంతో ఆ నీరు ఓపెన్ కాస్ట్ గనులలోకి చేరడంతోబొగ్గు ఉత్పత్తి కి ఆటంకం కలిగింది. జిల్లాలో ఉన్న ముడు ఓపెన్ కాస్ట్ గనులు శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణపూర్ ఓసిలకు భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి అంతరాయం జరుగుతుంది.
మంచిర్యాలలో వర్షాలు..నిలిచిపోయని బొగ్గు ఉత్పత్తి
గనుల్లోని రోడ్లన్నీ బురుదమయం అవడం తో బొగ్గు రవాణా చేసేందుకు వాడే బారి వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి నెలకొంది. దీనితో కేకే ఓసిపి లో 3వేల టన్నులు, రామకృష్ణాపుర్ ఓసిపి లో 5వేల టన్నులు,శ్రీరాంపూర్ ఓసిపి లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం జరిగింది.దీనితో పాటు ఓసిపి లో మట్టి తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది.దీనితో సింగరేణి సంస్థ కు కోట్లరూపాయలలో నష్టం వాటిల్లింది.మరో వైపు కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని కైరీ గూడ,బిపిఏ oc2 లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి 10వేల టన్నులు సాదించాల్సి ఉండగా 7500 టన్నులు బొగ్గు ను మాత్రమే తరలిస్తున్నారు.
No comments:
Post a Comment