Breaking News

16/08/2019

అన్న క్యాంటిన్లను వెంటనే తెరవాలి.. టి.జి భరత్

కర్నూలుఆగష్టు 16 (way2newstv.in)
పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే అన్న క్యాంటిన్లను వెంటనే తెరవాలని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టి.జి భరత్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న అన్న క్యాంటిన్ ను జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. మూతబడిన అన్న క్యాంటిన్లను వెంటనే తెరవాలని నినాదాలు చేశారు.
అన్న క్యాంటిన్లను వెంటనే తెరవాలి.. టి.జి భరత్

అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన లేరన్న సమాచారంతో డీఆర్వో వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్న క్యాంటిన్లు మూతపడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్న క్యాంటిన్లను మూసివేయడం బాధాకరమన్నారు. అన్న క్యాంటిన్ల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేయాలని.. ఇలా మూసివేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అన్న క్యాంటిన్లను ఓపెన్ చేయాలన్నారు. అనంతరం సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే క్యాంటిన్లను మూసివేయడం దారుణమన్నారు.

No comments:

Post a Comment