Breaking News

16/08/2019

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, ఆగష్టు 16 (way2newstv.in)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో  శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్ కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది సమర్పించారు. ఏ ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పాత ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి కొత్త ఆర్డినెన్స్కు సపోర్టు తీసుకుంటామని ప్రభుత్వం విన్నవించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై  హైకోర్టు వ్యాఖ్యానిస్తూ కౌంటర్లో పొందుపర్చిన అంశాల్లో వాస్తవం లేదని పేర్కోంది. మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే 606 అభ్యంతరాలు వచ్చాయి.  వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు  ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికలపై ఉన్న సమస్యను పక్కన పెట్టి ఎన్నికలు ఎలా వెళ్తారని అడిగింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది.

No comments:

Post a Comment