Breaking News

16/08/2019

ప్రభుత్వం ప్రతి ఇంటా వెలుగు నింపుతుంది

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి  
సింగోటం గ్రామంలో లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే 
కొల్లాపూర్ ఆగష్టు 16 (way2newstv.in)
 ప్రతి పేద ఇంటిలో ప్రభుత్వం సంక్షేమ పథకలతో వెలుగును నింపుతుంది అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సింగోటం గ్రామంలో ఉజ్వల ఉచిత పథకం లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తుందన్నారు.
ప్రభుత్వం ప్రతి ఇంటా వెలుగు నింపుతుంది 

సీయం కేసీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రం అంతా పచ్చగా ఉందన్నారు. కేటీఆర్ కృషితో తెలంగాణ ఐటి రంగంలో కోత్త పుంతలు త్రోక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో కొల్లాపూర్ ను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ సత్యనారాయణ, తెరాస నాయకులు చింతకుంట శ్రీనివాసులు, వెంకటస్వామి, రాఘవేంద్ర, వార్డ్ నెంబర్లు, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment