Breaking News

03/07/2019

గ్రామల అభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకం


జిల్లా కలెక్టర్ యం హనుమంతరావు
సంగారెడ్డి జూలై 3 (way2newstv.in
గ్రామాలలో వివాహాల చట్టం అమలు బాల్యవివాహాల నిషేధం పై అవగాహన కార్యక్రమం: జిల్లా కలెక్టర్  జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వివాహాల చట్టం అమలు చేయాలని బాల్యవివాహాల నిషేధం పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఈ ఓ పి ఆర్ డి వో లు, సిడిపిఓలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతు రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు 

గ్రామల అభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకం 

గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పథకాల పట్ల పంచాయతీ కార్యదర్శుల కు పంచాయతీ చట్టాల పై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నూతన పంచాయతీ చట్ట ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వివాహాలను రిజిస్ట్రేషన్ తప్పనిసరి జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు పంచాయతీ కార్యదర్శులు అందజేయాలని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి భవాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సర్పంచుల తోపాటు గ్రామ నాయకులు సమావేశాలకు కలిసి వారి భాగస్వామ్యంతో గ్రామ సమావేశాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరాలని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ జి బి పాటిల్ మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల పలు అనారోగ్య సమస్యలు యువకులలో ఉత్పన్నమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నుద్దేశించి జిల్లా పంచాయతీ విస్తరణ అధికారి వెంకటేష్ ,జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మోతీ ,జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఎంపీడీవోలు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment