Breaking News

03/07/2019

త్వరలో చింతమడకలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌ జూలై 3(way2newstv.in)  
తన స్వగ్రామమైన చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు.ఈ మేరకు బుదవారం మధ్యాహ్నం సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు.
త్వరలో చింతమడకలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌.. తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించనున్నారు.

No comments:

Post a Comment