Breaking News

09/07/2019

రాజ్య‌స‌భ‌ను స్తంభింప‌చేసిన క‌ర్నాట‌క రాజ‌కీయాలు

న్యూడిల్లీ జూలై 9 (way2newstv.in)
క‌ర్నాట‌క రాజ‌కీయాలు ఇవాళ రాజ్య‌స‌భ‌ను స్తంభింప‌చేశాయి. దీంతో మంగళవారం ఉద‌యం స‌భ‌ను మొద‌ట గంట‌సేపు వాయిదా వేశారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ స‌భాకార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్న‌ది. వెల్‌లోకి దూసుకువెళ్లిన స‌భ్యులు.. బీజేపీకి వ్య‌తిరేకంగా నినాదం చేశాయి. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిలో చిచ్చు రావ‌డానికి బీజేపీయే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ ఆరోపించింది. 
రాజ్య‌స‌భ‌ను స్తంభింప‌చేసిన క‌ర్నాట‌క రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల రాజీనామాతో సీఎం కుమార‌స్వామి భ‌విష్య‌త్తు ఇర‌కాటంలో ప‌డిన విష‌యం తెలిసిందే. క‌ర్నాట‌క అసెంబ్లీలో మొత్తం 225 ఎమ్మెల్యేలు ఉన్నారు. 113 మ్యాజిక్ ఫిగ‌ర్‌. ఈసారి స‌మావేశాల్లో రాజ్య‌స‌భ వాయిదాప‌డ‌డం ఇవాళే మొద‌టిసారి. క‌ర్నాట‌క అంశాన్ని చ‌ర్చించాల‌ని 267 రూల్ కింద కాంగ్రెస్ ఎంపీ హ‌రిప్ర‌సాద్ నోటీసు ఇచ్చిన‌ట్లు చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తెలిపారు. అయితే స‌భ్యులు వెల్‌లోకి దూసుకువెళ్ల‌డంతో.. ఆ నోటీసును అనుమ‌తించ‌డంలేద‌న్నారు. 12 గంట‌లకు మ‌ళ్లీ స‌మావేశ‌మైన త‌ర్వాత కూడా స‌భ్యులు హోరెత్తించారు. దీంతో స‌భ‌ను మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు.

No comments:

Post a Comment