Breaking News

09/07/2019

వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు

వరంగల్లు అర్బన్, జూలై 09, (way2newstv.in)
వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆదేశించారు. అందులో భాగంగా ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించి ప్రజలను  అప్రమత్తం చేయాలని సూచించారు.  మంగళవారం  కలెక్టరేట్ లో  నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధ్యుల నివారణకు చేపట్టాల్సిన చర్యలు పై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 14 ఆర్యోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్తె సూపర్ వైజర్లు, ఫార్మసిస్టుల పనితీరును జిల్లా కలెక్టర్ సమీక్షించారు.  
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు

హై రిస్క్ ఏరియాలతో పాటు ముందస్తుగా అన్ని ప్రభుత్వ గురుకులాలు, కె.జి.బి.విలు, వసతి గృహాలతో ముందస్తు  వైద్య శిభిరాలు నిర్వహించాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెడికల్ ఆఫీసర్లను సస్పండ్ చేయనున్నట్లు  హెచ్చరించారు. అంటువ్యాధుల నివారణకు ఓ.హెచ్.ఎస్.ఆర్.లను ప్రతి 15 రోజుల కొకసారి శుభ్రం చేసి, రెగ్యులర్ గా క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని  పంచాయితీరాజ్, మున్పిపల్ అధికారులను  ఆదేశించారు. గ్రామాలలో ట్యాంకుల నీటి నిల్వ సామర్ధ్యం బట్టి గ్రామ పంచాయితీ కార్యదర్శుల ద్వారా క్లోరినేషన్ చేసే ప్రక్రియను మానిటరింగ్ చేసేబాధ్యతను ఎం.పి.డి.ఓ.లు పంచాయితీరాజ్  విస్తరణాధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.  మున్సిపాలిటిలో ప్రజారోగ్య విభాగం అధికారులు ఈ పనులు చేయాలని స్పష్టం చేశారు. క్లోరినేషన్ మోతాదుపై ఎం.పి.డి.ఓలకు గ్రామ పంచాయితీ కార్యదర్శులకు అవగాహన కల్పించుటకై క్లోరినేషన్ చార్జలు జారీ చేయనున్నట్లు   తెలిపారు. గ్రామం, వార్డు లోని చివరి నల్లాకు అందే నీటిలో కూడా సరియైన మోతాదులో క్లోరిన్ ఉండాలని తెలిపారు. 2018 జనవరి నుండి డిశెంబర్ వరకు 10 స్వైన్ ప్లూ కేసులు, 14 మలేరియా కేసులు, 145 డెంగ్యు కేసులు,6 పైలేరియా కేసులు నమోదు అయినప్పటికి మరాణాలు సంభవించలేదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్ లాల్, జిల్లా విద్యా శాఖాధికారి కె.నారాయణ రెడ్డి, జోనల్ మలేరియా అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీక్రిష్ణారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి,  ఎం.జి.ఎం-ఆర్.ఎం.ఓ  డాక్టర్ వెంకట రమణ, ఇఇ-మలేషం, జిల్లా పంచాయితీ అధికారి మహమూద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment