Breaking News

30/07/2019

కోకపేట సిటీపై అక్టోబరు నాటికి నివేదిక పూర్తి

హైద్రాబాద్, జూలై 30, (way2newstv.in)
కొత్త సిటీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగర విస్తీర్ణం, జనాభా విపరీతంగా పెరుగుతుండటంతో, శివారు ప్రాంతాల వరకు సిటీ పరిధి విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఐటీ కారిడార్ లోని కోకాపేటలో నూతన నగరానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు చేస్తుండగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి.  ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి నివేదిక తయారీ బాధ్యతలను అప్పగించగా, మూడు నెలల్లో ఈ రిపోర్టు రెడీ కానుంది. దీని ఆధారంగానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేస్తామని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ స్థల ప్రభావం ఎక్కువైపోయింది. పెరుగుతున్న జనాభా, కంపెనీల రాకతో నూతన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి వస్తోంది. 
కోకపేట సిటీపై అక్టోబరు నాటికి నివేదిక పూర్తి

ఇప్పటికే నగరం నలుదిశలా నిర్మాణ, పారిశ్రామిక నిర్మాణాలు జరుగుతుండగా, తాజా నిర్ణయంతో ఐటీ కారిడార్ పరిధి మరింత విస్తరించనుంది.  దీనికోసం సిటీలోని కోకాపేటలో నూతన నగరాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టింది. కోర్ సిటీలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుండటంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శివార్లలోనే పారిశ్రామిక ప్రాంతాలకు ఆనుకుని కమర్షియల్ తోపాటు రెసిడెన్షియల్ కలిసి ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. వచ్చే పదేళ్లకు అనుగుణంగా రవాణా, రోడ్లు, మౌలిక వసతులు, వర్క్ స్పేస్ వంటి అంశాల ఆధారంగా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.ఈ క్రమంలో 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ మినీ నగరాలను, అర్బన్ సిటీలను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొత్త సిటీలను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో పైలెట్ ప్రాజెక్టు గా కోకాపేటలో ఇంటిగ్రేటెడ్ న్యూ సిటీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి.కోర్ సిటీపై భారం తగ్గించేలా, సిటీ నలు దిశలా అభివృద్ధి జరిగేందుకు వీలుండటంతో, ఓఆర్ఆర్ చుట్టూ వీటిని ఏర్పాటు చేయాలని భావించింది. ఇప్పటికే నివేదికను సిద్ధం చేసే పనులు జరుగుతుండగా, అక్టోబర్ నెలాఖరు వరకు న్యూ సిటీ రిపోర్టు రెడీ కానుంది. ఈ బాధ్యతలను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించగా, రిపోర్ట్ ఆధారంగా ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి, ఆ తర్వాత డీపీఆర్, టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టేలా హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పాతదే అయినా, సిటీపై విపరీతమైన భారం పడనుంది. వచ్చే ఐదేళ్లలో కొత్త సిటీ నిర్మాణం పూర్తి చేసేలా రూ.150 కోట్లను ఖర్చు చేయనుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన లే అవుట్ అమల్లోకి వస్తుందని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయిఅయితే అధికారులు కోకాపేటలో నూతన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నా… క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే ఐటీ రంగానికి కేంద్రంగా హైటెక్ సిటీ తర్వాతి స్థానంలో కోకాపేట ఉంది. ప్రస్తుతానికి 50 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరికొన్ని నెలల్లో  మరో20 లక్షల కమర్షియల్ స్పేస్ వినియోగంలోకి రానుంది,  మరో 50 వేల మంది ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతానికి రానున్నారు. దీంతో తాగునీటి అవసరాలతోపాటు, రోడ్లు, రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికేఈ ప్రాంతాల్లో అంచనాలకు మించి పెరిగిపోతున్న ట్రాఫిక్ తో తీవ్రంగా ఐటీ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు తాజాగా హెచ్ఎండీఏ న్యూ సిటీకి ప్లాన్ చేస్తుండగా వచ్చేఐదేళ్లలో కనీసం 5 లక్షల మందికి నివాసయోగ్యంగా ఉండేలా రోడ్లు, వైద్యం, రవాణా, విద్య, తాగునీరు, డ్రైనేజీ వంటి సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. నిత్యం ఈ ఏరియాలో 40వేలకు పైగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటే, రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మెరుగైన రవాణా, రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనువుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందితే అన్ని అంశాలపై ప్రభావం చూపుతుందని రియాల్టీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హెచ్ఎండీఏకు కోకాపేటలో దాదాపు 600 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఐటీ కంపెనీలకు, మౌలిక వసతుల కల్పనకు దాదాపు 200 ఎకరాల భూమిని కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ న్యూ సిటీలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ.150 కోట్లు  ఖర్చవుతుందని ప్రాథమిక అంచనాలు ఉండగా, 90 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెసిడెన్సియల్, కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. దీంతో వచ్చే పదేళ్లలో ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగాల కల్పన దాదాపు 15 లక్షల మందికి అవకాశం దొరుకుతుంది. దీంతోపాటు ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ఎయిర్ పోర్టులు  సమీపాన ఉండటం, ఐటీ కేంద్రంగా హైదరాబాద్ విస్తరించడంతోపాటు ప్రస్తుతం ఐటీ కారిడార్ ప్రాంతానికి దగ్గర్లోనే నూతన సిటీని నిర్మిస్తే, అన్ని విధాలుగా కలిసి వస్తుందనీ, ఈ అంశాలతోనే కోకాపేటతో కొత్త నగరాలకు శంకు స్థాపన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment