Breaking News

06/07/2019

రైతు దినోత్సవానికి ఏర్పాట్లు


కర్నూలు, జూలై 06, (way2newstv.in):
అన్ని నియెజకవర్గాల్లో ఈ నెల 8వ తేది రైతు దినోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు సిద్దం  చేసుకోవాలని జిల్లా  కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం డయల్ యువర్ కలెక్టర్ అనంతరం అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కరంపై సమీక్షించారు. జాయింటు కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్, జెసి-2 మణిమాల, డిఆర్ ఓ వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేది దివంగత ముఖ్యమంత్రి డా.వై.స్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని అన్ని నియోజరవర్గాల్లో రైతు ఉత్సవాలను నిర్వహించేందుకు వ్యవసాయశాఖతో సమన్వయం చేసుకొని ఏర్పాటు సిద్దం చేసుకోవాలన్నారు. 

రైతు దినోత్సవానికి ఏర్పాట్లు

సమావేశంలో రైతులకు వ్యవసాయ ఉపకరణాలు, వృద్దులకు నూతనంగా పెంచిన పెన్షన్లు, పాఠశాల విద్యార్ధులకు సైకిళ్లు, ఇతర అనుబంధ శాఖల అస్పెల్స్  పంపిణిలో  వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం  చేసుకోవాలన్నారు. స్పందన  కార్యక్రమం ద్వారా స్వీకరించిన విపతులపై ప్రత్యేక దృష్టి  సాదించి ఆర్ధిక, ఆర్ధికేరత సమస్యలను వెంటనే  పరిష్కరించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి,  మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ఫిర్యాదులపై వీడియోకాన్పరెన్స్ ద్వారా  సమీక్షిస్తూన్నారన్నారు. సియం కార్యాలయం నుండి 40 ఫిర్యాదులపై వచ్చాయని దీనిపై కూడ అత్యంత  ప్రత్యేక దృష్టి  సారించి పరిష్కరించాలన్నారు. ఆగస్టు 15  నుండి సియం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టనున్నారని ఏ సమయంలోనైనా ఆకస్మిక పర్యటనకు వచ్చి లబ్ధిదారులకు ఇచ్చిన కాలపరిమితి రశీదు పరిశీలించే అవకాశమున్నందున అధికారులందరూ సమస్యలపై  అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గిరిజన హాస్టళ్లు  పై సరైన సమాచరం ఇవ్వని  గిరిజన సంక్షేమాధికారి ధనుంజయను ప్రభుత్వం  నికి సరెండరు చేయాల్సిందిగా డిఆర్ ఒను ఆదేశించారు.  ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జేడి ఠాగుర్ నాయక్, డిఆర్టిఎ ,పిడి రామకృష్ట, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, ఇతర జిల్లా  ఉన్నత స్థాయి అధికారులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment