Breaking News

06/07/2019

రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించింది: కేటీఆర్


హైదరాబాద్‌ జూలై 6 (way2newstv.in): 
కేంద్ర బడ్జెట్‌ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు.తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ .ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించింది: కేటీఆర్

ఫై రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందనీ, అయితే కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించిందని కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రస్తావించారు.ఐదేళ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.

No comments:

Post a Comment