Breaking News

06/07/2019

ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు


మూడేళ్ల పాటు ఇవే అమల్లో
హైదరాబాద్ జూలై 06 (way2newstv.in
ఇంజనీరింగ్ ఫీజులు ఖరారయ్యాయి. కోర్టుకెళ్లిన 80 కాలేజీలు, కోర్టుకు పోని మరో 23 కాలేజీలు సహా103 కాలేజీల ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఫిక్స్ చేసింది. కోర్టుకెళ్లని మరో 88 కాలేజీలకు తాత్కాలిక ఫీజును ఖరారు చేసింది. శనివారం నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు

వచ్చే మూడేళ్ల పాటు ఇవే ఫీజులు అమల్లో ఉండనున్నాయి. ఫీజులు ఖరారు చేయాల్సిందిగా రాష్ట్రంలోని 191 ఇంజనీరింగ్ కాలేజీలు జనవరిలో ఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, కమిటీకి చైర్మన్ లేకపోవడంతో అది ఆలస్యమైంది. దీంతో 80 కాలేజీలు హైకోర్టుకెళ్లాయి. ఏఎఫ్ఆర్సీకి తాము ప్రతిపాదించిన ఫీజులను వసూలు చేసుకునేలా ఉత్తర్వులను తెచ్చుకున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం ఏఎఫ్ఆర్సీకి చైర్మన్ను నియమించడం, ఆయన కాలేజీల ఫీజులను నిర్ణయించడం చకచకా జరిగిపోయాయి. తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్ నిర్వహిద్దామని కోర్టుకెళ్లిన మేనేజ్మెంట్లకు ఆయన సూచించారు. అందులో భాగంగా గతంలో రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల్లో 15 శాతం, రూ.50 వేల కంటే తక్కువ ఫీజులున్న కాలేజీల్లో 20 శాతం పెంపునకు ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించింది. అయితే దాన్ని కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించాయి. అయినా కూడా ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే కమిటీ ఖరారు చేసింది. 

No comments:

Post a Comment