Breaking News

06/06/2019

ముదురుతున్న ఎండలు నిర్మానుష్యంగా మారిన రోడ్లు రహదార్లు


ఎక్కడ కనిపించని ప్రభుత్వ చలివేంద్రలు
కౌతాళం జూన్ 6, (way2newstv.in)
మండల కేంద్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొద్ది పాటి వర్షానికి ఎండ వేడిమి గాలిలేక  ఉక్కపోత జనాలు కులార్లకు అతుక్కుపోతున్నారు.అందులో ఇష్టను సారంగా విద్యుత్ కోతలు, చెట్ల కింద పరుగులు పెడుతున్నారు. ఎక్కడ బావులు చెరువులు,బొరింగులు,కొలైల కనిపించిన అందులోనే కాలం గడిపేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే భానుడి భగభగ మండు తున్నాడు.


ముదురుతున్న ఎండలు నిర్మానుష్యంగా మారిన రోడ్లు రహదార్లు
దీంతో జనం రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. జనం లేక రోడ్లు  నిర్మానుష్యంగా మారుతున్నాయి.మండలం లో  42  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొద్ది పాటి వర్షానికి ఉష్ణోగ్రతలు మరింత పెరుగు తున్నాయి. వివిధ గ్రామాల నుంచి జనం వస్తుంటారు.అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయలేదనీ జనం రద్దీగా ఉన్న సెంటర్ లో ప్రభుత్వ చాలి వేంద్రలు ఏర్పాట్లు చేయాలని కోరారు.

No comments:

Post a Comment