Breaking News

06/06/2019

వడ్డీరేట్లు తగ్గాయ్..

ముంబయి జూన్ 6, (way2newstv.in)
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గురువారం వెల్లడించింది.  ఇందులో రెపో రేటుపై పావు శాతం కోత విధించింది. ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 5.75శాతానికి చేరింది.  

వడ్డీరేట్లు తగ్గాయ్..
రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది.  ఆర్బీఐ వరుసగా మూడు సమీక్షల్లోనూ వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.  ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీభారం తగ్గనుంది. 2019-20 తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్భణం 3.0-3.1శాతంగా, రెండో అర్ధభాగంలో 3.4-3.7శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్పై ఛార్జీలు ఎత్తివేత. ఈ ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేయాలని ఆదేశించింది.

No comments:

Post a Comment