Breaking News

11/06/2019

మర్రి రాజశేఖర్ విషయంలో జగన్


గుంటూరు, జూన్ 11, (way2newstv.in)
మాట‌త‌ప్పను-మ‌డ‌మ తిప్పను.. అంటూ ప్రజ‌ల‌కు హామీ ఇచ్చిన వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం జ‌గ‌న్‌.. పార్టీలో ఓ సీనియ‌ర్ నేత‌ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ విషయంలో మాత్రం ఒకింత వెనుక‌డుగు వేశారా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీని అన్ని విధాలా ఆదుకుని, క‌ష్ట కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన నాయ‌కులు ఎంద‌రో ఉన్నారు. జ‌గ‌న్‌తో పాటు సంఘీభావంగా పాద‌యాత్రలు చేసిన వారు కూడా ఉన్నారు. జ‌గ‌న్ సీఎం కావాల‌ని క‌ల‌లు క‌న్న నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే, వీరంతా కూడా పార్టీ ప‌రంగా ల‌బ్ధి పొందాల‌ని అనుకోవ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో పార్టీ అధినేత ఆదేశాల‌ను శిర‌సావ‌హించిన నాయ‌కులు కూడా చాలా మంది ఉన్నారు.వీరిలో కీల‌క‌మైన నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే, జ‌గ‌న్ ఆదేశాల నేప‌థ్యంలో మ‌ర్రి ప‌క్కకు త‌ప్పుకొని ఇక్కడ నుంచి బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీకి టికెట్ కేటాయించారు. 


మర్రి రాజశేఖర్ విషయంలో జగన్ 
దీంతో మ‌ర్రి తీవ్ర ఆగ్రవేశాల‌కు లోన‌య్యాడు. ఇదే స‌మ‌యంలో జోక్యం చేసుకున్న జ‌గ‌న్‌.. మ‌ర్రికి త‌న ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని ప్రక‌టించారు. ఈ మేర‌కు హామీ కూడా ఇచ్చారు. చిల‌క‌లూరిపేట‌లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌లో కూడా జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ప‌బ్లిక్‌గా ప్రక‌టించారు. దీంతో తాజా మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో మ‌ర్రికి అవ‌కాశం ఉంటుంద‌ని అనుకున్నారు.మ‌ర్రికి కేబినెట్ బెర్త్ ఖాయ‌మ‌ని డిసైడ్ అయిన జిల్లా పార్టీ నేత‌లు అంద‌రూ ఆయ‌న‌కు ముందుగానే అభినంద‌న‌లు, శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. కానీ, అనూహ్యంగా జ‌గ‌న్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వలేదు. తాజాగా జ‌గ‌న్ ప్రక‌టించిన మంత్రి వ‌ర్గ జాబితాలో మ‌ర్రి పేరు లేక పోవ‌డంతో ఆయ‌న అనుచ‌రులు హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. ఇక‌, జ‌గ‌న్ త‌న కేబినెట్ ఏర్పాటు విష‌యంలో తీసుకున్న జాగ్రత్తలు, కులాల స‌మీక‌ర‌ణ‌లు వంటివాటిని చూస్తే.. క‌మ్మ వ‌ర్గానికి జ‌గ‌న్ ఒకే ఒక బెర్త్ కేటాయించారు. దీంతో ఇది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కేటాయించారు.గుడివాడ‌లో నాని వ‌రుస‌గా నాలుగుసార్లు గెలుస్తూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ కోసం ఎన్టీఆర్ కుటుంబానికి వీర‌విధేయుడిగా ఉండి కూడా చంద్రబాబుపై ఒంటికాలితో లేచేవారు. ఇక మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌కు కేటాయించ‌లేక పోవ‌డానికి ఇదే రీజ‌న్ అయి ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తానికి సామాజిక వ‌ర్గ స‌మ‌తుల్యం పాటించ‌డంతోనే జ‌గ‌న్ న్యాయం చేయ‌లేక పోయార‌ని అంటున్నారు. వ‌చ్చే రెండున్నరేళ్ల త‌ర్వాత‌.. మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న ఉంటుంది కాబ‌ట్టి అప్పుడు ఖ‌చ్చితంగా మ‌ర్రికి ఛాన్స్ ఉంటుంద‌నిఅంటున్నారు. మ‌రి జ‌గ‌న్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment