Breaking News

11/06/2019

విశాఖలో ముగ్గరు మిత్రుల కధ


విశాఖపట్టణం, జూన్ 11, (way2newstv.in)

రాజాకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలాగే గెలుపు ఓటములు కూడా శాశ్వతంగా వెంట రావు. విశాఖ జిల్లాలో ముగ్గురు మిత్రుల కధలో ఇపుడు ఇదే నిజం అయింది. 2008న ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అప్పటికి సీనియర్ ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన మిత్రులు ఇద్దరినీ కలుపుకుని పార్టీలో చేర్పించారు. అలా పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, భీమునిపట్నం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఈ ముగ్గురు మిత్రులు తరువాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అట్నుంచి 2014 నాటికి తెలుగుదేశంలో చేరి కూడా టికెట్లు సంపాదించుకున్నారు గెలిచారు. ఇలా వీరి అనుబంధం రాజకీయాలను, ఓటమిని సైతం ధిక్కరించి స్థిరంగా సాగింది.తాజా ఎన్నికలనాటికి ఎలమంచిలి నుంచి టీడీపీ తరఫున మళ్ళీ పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు దారుణంగా ఓటమిపాలు అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన్ని ఓడించి వైసీపీ అభ్యర్ధి కన్నబాబురాజు గెలుపొందారు. 

విశాఖలో ముగ్గరు మిత్రుల కధ
దాంతో తొలిసారి పంచకర్ల ఓటమి చవిచూసారు. గంటా చలువతో, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ముందుకు వచ్చిన పంచకర్ల ఓటమి ఇపుడు చర్చగా ఉంది. ఆయన పొలిటికర్ కెరీర్ డైలామాలో పడింది. అదే సమయంలో భీమిలీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ముత్తంశెట్టి గెలిచారు. ఇక పార్టీ మారకపోయినా సీటు మారిన గంటా విశాఖ నార్త్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు పంచకర్ల మాత్రమే మాజీ అయిపోయారు. పదేళ్ళ రాజకీయ క్రీడలో పంచకర్లను తొలిసారి ఓటమి పలుకరించింది.ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీ వైపు వసున్నపుడు పంచకర్ల కూడా ఇటు వైపు వస్తారని అంతా అనుకున్నారు. ఆ విధంగా ప్రచారం కూడా సాగింది. పంచకర్ల పార్టీలో చేరితే ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చేందుకు కూడా జగన్ ఒకే అన్నారని టాక్. అక్కడ ఇపుడు వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. అయితే గంటా మాట విని టీడీపీలో కొనసాగిన పంచకర్ల ఇపుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. 2024 నాటికి రాజెవరో మంత్రి ఎవరో అందువల్ల అప్పటి రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మొత్తానికి గత దశాబ్దం పైగా ముగ్గురు మిత్రులు సక్సెస్ ఫుల్ పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు, ఇపుడు మాత్రం ఓ మిత్రుడు పక్కకు వెళ్ళిపోవడం వారికే కాదు, జిల్లా రాజకీయాల్లోనూ చర్చగానూ, ఆసక్తికరంగానూ ఉంది.

No comments:

Post a Comment