Breaking News

12/06/2019

తమ్ముళ్లు ఆపరేషన్ ఆకర్ష్...


విజయవాడ, జూన్ 12 (way2newstv.in)
ఏపీలో విపక్షంలో జగన్, అధికారంలో చంద్రబాబు, అయిదేళ్ళ పాటు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం సాగింది. ఒకరిని మరొకరు హననం చేసుకోవడానికి వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు ఎన్నో. చివరకు అపర చాణక్యుడు చంద్రబాబుని అధికారంలో నుంచి అనూహ్యంగా దించేసిన జగన్ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం పట్టేశారు. వైసీపీకి వచ్చిన ఊపు, సీఎం గా జగన్ వేస్తున్న అడుగులు, ఆయనకు ఉన్న రాజకీయ అనుకూలతలు అంచనా వేస్తున్న రాజకీయ పండితులు జాగ్రత్తగా పనిచేసుకుంటే మరో టెర్మ్ కూడా సులువుగా జగన్ అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సైతం తనదైన ముద్రను ఏపీ రాజకీయల మీద, పాలన మీద బలంగా వేసుకుంటున్నారు.ఇక ఏపీలో రాజకీయ మైదానంలో మే 23 ముందు వరకూ పరిస్థితి వేరు. బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు మోహరించి నువ్వా నేనా అంటూ పోరాడాయి.


తమ్ముళ్లు ఆపరేషన్ ఆకర్ష్...
దాంతో మూడవ పక్షం అన్న ఊసు లేకుండా పోయింది. ఈ పోరును చూస్తే చావో రేవో అన్నట్లుగానే సాగింది. మరి జగన్ అధికారం దక్కిందుకుంటే టీడీపీకి ఇపుడు చావు బతుకుల సమస్యగా ఉంది. ఆ పార్టీ ఎన్నడూ లేనంతగా అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతోంది. జగన్ యువకుడు, అన్ని రకాలుగా వనరులతో, అధికార వైభోగంతో దూకుడు మీద ఉన్నారు. అదే సమయంలో టీడీపీకి చంద్రబాబే దిక్కు. ఆయన మీద కూడా తమ్ముళ్ళకు మెల్లగా విశ్వాసం సడలుతున్న వాతావరణం. మరో వైపు బాబు వయసు డెబ్బై పడిలో పడడమే ఇపుడు టీడీపీని కలవరపెడుతున్న అతి పెద్ద అంశంగా ఉంది. దాంతో ఇపుడు ఏపీలో ఉన్న రాజకీయ మైదానంలో జగన్ ముప్పావు వంతు ఆక్రమించి ఎన్నడూ లేనంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. మరో వైపు టీడీపీ క్లిష్ట దశలో ఉంది. మొత్తంగా చూస్తే రాజకీయ శూన్యత మాత్రం బాగా కనిపిస్తోంది.సరిగ్గా ఇదే రకమైన అంచనాలతో కేంద్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన కమలదళం ఏపీలో కన్నేసిందన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆ పార్టీ కీలక నేతలు టీడీపీ పని అయిపోయిందని, తామే బలమైన ప్రతి పక్షంగా అక్కడ అవతరిస్తామని చెప్పుకొచ్చారు. ఇపుడు ఆ పనిలోనే కాషాయదళం బిజీగా ఉంది. టీడీపీ సంక్షోభం నుంచి సరికొత్త రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవాలనుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీలో నో ఛాన్స్ అనడం కూడా బీజేపీకి కలసి వస్తోంది. అదే విధంగా ఓడినా స్థానికంగా బలంగా ఉన్నటీడీపీ పెద్ద నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట దగ్గరకు తీస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలే జంప్ చేస్తే ఇక బీజేపీ పని మరింత సులువు అవుతుంది. మరో వైపు పవన్ కళ్యాణ్ జనసేన కూడా రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. స్థానిక ఎన్నికల్లో కనుక జనసేన ఏమైన ప్రభావం చూపిస్తే ఆ పార్టీకి చాన్స్ కొంత ఉండొచ్చేమో. చూడాలి.

No comments:

Post a Comment