Breaking News

12/06/2019

ఏపీలో కొత్త జిల్లాల హడావిడి


విజయవాడ, జూన్ 12 (way2newstv.in)
అనుకున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఎన్నికల్లో చెప్పిన మాట మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా చేయాలన్నది వైసీపీ విధానం. ఆ ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్రాలో ఇపుడున్న మూడు జిల్లాలు కాస్తా అయిదు జిల్లాలు అవుతాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. కొత్తగా విశాఖ జిల్లా అంటే పూర్తిగా అర్బన్ జిల్లాకు పరిమితం అవుతుంది. ఆరు అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఎస్ కోటను కలపాలని ప్రతిపాదన పెండింగులో ఉంది.ఇక అనకాపల్లిని ఎప్పటి నుంచో జిల్లా చేయాలన్న ప్రతిపాదన ఉంది. రూరల్ జిల్లాకు ముఖ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఏడు అసెంబ్లీ సీట్లు అనకాపల్లి జిల్లా పరిధిలోకి వస్తాయి. 


పీలో కొత్త జిల్లాల హడావిడి
ఏజెన్సీలో రెండు మినహాయించి అనకాపల్లిని జిల్లాగా చేస్తారని అంటున్నారు. ఇక ఏజెన్సీలో ఉన్న పాడేరు, అరకు,పార్వతిపురం శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాలు కలిపి అరకు కేంద్రంగా గిరిజన జిల్లాగా ఏర్పాటు అవుతుందని చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ చిక్కు సమస్య ఉంది. అరకు పాడేరు పార్లమెంట్ నియోజకవర్గం వరకూ కూర్పు బాగానే ఉన్నా అదే జిల్లాగా చేయాలంటే మాత్రం భౌగోళికపరంగా సమస్యలు వస్తాయని అంటున్నారు.ఇక విజయనగరం జిల్లాలో భాగంగా ఉన్న పార్వతీపురం ని జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే రెవిన్యూ డివిజన్ గా ఉన్న ఈ ప్రాంతం జిల్లాకు కావాల్సిన భవనాలు అన్ని సమకూర్చుకుంది. రైలు, బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి. పైగా శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, పాలకొండ వంటివి పార్వతీపురంలో కలిపితే దగ్గర అన్న మాట ఉంది. అదే అరకు జిల్లా అయితే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం ప్రాంతాల వారికి బహుదూరమని అంటున్నారు. దీంతో పాటు అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని అరకు జిల్లా ఏర్పాటు కష్టమని అధికారులే చెబుతున్నారు. మేధావులు, అధికారులు మాత్రం భౌగోళిక పరిస్థిలు ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అపుడు ప్రస్తుతం ఉన్న జిల్లలలో కొన్ని విడదీసి కొన్ని కలిపి కొత్త జిల్లాలను ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి.

No comments:

Post a Comment