గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా జలమండలి పకడ్బందీ ఎర్పాట్లు చేస్తోంది. వేసవి కాలం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి వినియోగం పెరింగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా సరిగ్గాలేని ప్రాంతాల్లో అవసరమైతే వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరాను అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. నగరంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు పెరిగిన ట్యాంకర్ల వాడకం డిమాండ్‌కు అనుగుణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధనంగా 20 ఫిల్లింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలు రౌండ్ ది క్లాక్ వాటర్ ట్యాంకర్లను సరఫరా చేసేందుకు జలమండలి పర్యవేక్షణలో ఉన్న ప్రస్తుత వాటర్ ట్యాంకర్లకు అనుగుణంగా మరో 130 నూతన ట్యాంకర్లను వినియోగదారులు సౌకార్యర్థం అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వాటర్ ట్యాంకర్ల వినియోగం నగరంలో భారీగా పెరిగింది. వాటర్ ట్యాంకర్ బుక్ చేసిన మూడు, నాలుగు రోజులకు వినియోగదారులకు చేరుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే నగరంలో నీటి వినియోగం ఎంతమేరకు పెరిగిందో అంచనా వేయవచ్చు.
సిటీలో భారీగా ట్యాంకర్ల జోరు
డిమాండ్ ఉన్న చోట వాటర్ ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. నాగార్జున సాగర్‌లో పడిపోతున్న జలాల నేపథ్యంలో నగరానికి నీటికొరత రాకుండా ఉండేందుకు జలమండలి ముందస్తు చర్యలు ప్రారంభించింది. జలమండలి టెక్నికల్ డైరెక్టర్ అధికారి వీఎల్.ప్రవీణ్ కుమార్ పుట్టంగండి వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర నీటి పంపింగ్ పనులను ట్రాన్స్‌మీషన్ చీఫ్ జనరల్ మేనేజర్ సుదర్శన్‌తో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నగర వాసుల నీటి అవసరాల కోసం జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు ప్రతి రోజు 270 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 508.76 అడుగులకు పడిపోయింది. మరో పక్క నీటి మట్టం సాగర్‌లో ఒక అడుగు పడిపోగానే అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని నగరానికి సరఫరా చేసేందుకు ట్రాన్స్‌మిషన్ అధికారులు చర్యలు తీసుకుంటుంది. పుట్టంగండి వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర పంపింగ్ పనులను జలమండలి అధికారులు పరిశీలించారు. అత్యవసర పంపింగ్‌తో పుట్టంగండికి నీటిని తరలించి, అక్కడ నుంచి కోదండపూర్‌కు తరలించి అక్కడ శుద్ధి చేసి నగరానికి తరలించేందుకు జలమండలి విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం పది పంపులను నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేశారు. అందులో 600 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపులు ఐదు ఉండగా, 300 హేచ్‌పీ సామర్థ్యం
కలిగిన పంపులను సిద్ధంగా ఉంచారు. 33కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పుట్టంగండి వరకు ఏర్పాటు చేసిన అత్యవసర పంపింగ్ పనులు పూర్తయ్యాయి.
No comments:
Post a Comment