Breaking News

17/05/2019

ఇక అందరి చూపు..కౌంటింగ్ వైపు

విజయవాడ, మే 17, (way2newstv.in)
పోలింగ్ ముగిసిన రోజు నుంచి టిడిపి అధినేత చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు. ఒక పక్క వైసిపి పైన మరోపక్క ఎన్నికల సంఘం, అధికారుల తీరుపై ఆయన అసహనం వైసిపికి ఓటింగ్ బాగా జరిగిందనే ప్రచారాన్ని మరింత బలపరిచింది. దానికితోడు తన ఓటు సైకిల్ కి వేస్తే ఫ్యాన్ కి పోయిందంటూ సంచలన వ్యాఖ్యలే బాబు చేశారు. ఈ వ్యాఖ్యలు టిడిపి శిబిరంలో గందరగోళం రేకెత్తించాయి. జరిగిన డ్యామేజ్ గమనించిన చంద్రబాబు వెంటనే తేరుకుని ఈవీఎం లు గోల్ మాల్ చేసినా తమ పార్టీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని మరో ప్రకటన చేసి క్యాడర్ ను సంతృప్తి పరిచారు. 


ఇక అందరి చూపు..కౌంటింగ్ వైపు

అయినా దేశవ్యాప్తంగా 21 రాజకీయ పక్షాలతో వివి ప్యాట్ లను 50 శాతం లెక్కించాలంటూ గట్టి పోరాటమే చేశారు.ఒక వ్యూహం ప్రకారం టిడిపి అధినేత సాగించిన ఈ కార్యక్రమం తో వైసిపి అప్రమత్తం అయ్యింది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ ఆర్ పార్టీ. దాంతో ఆ పార్టీ వ్యూహకర్తలు కౌంటింగ్ లో అధికారపార్టీ సృస్ట్టించే అవాంతరాలను ధీటుగా తమ పార్టీ క్యాడర్ఎదుర్కొనేలా సిద్ధం చేయాలని సంకల్పించింది.  అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ శిక్షణలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. చివరి ఈవిఎం లెక్కించే వరకు వైసిపి ఏజెంట్లు ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి రాకూడదని ఇప్పటికే కౌంటింగ్ లో అనుసరించే ప్రధాన అంశాల్లో చేర్చారు. టిడిపి పోటీలో వెనుకబడినప్పుడు గందరగోళం సృష్టిస్తే సంయమనంతో ఎలా వ్యవహరించాలి ? ఎన్నికల నిబంధలనలను పాటిస్తూ ఫిర్యాదులు చేయడం వంటి వాటిపై శిక్షణ అందించనుంది వైసిపి

No comments:

Post a Comment