Breaking News

17/05/2019

ఆర్టీసీ, తిరుమల టై అప్

తిరుమల, మే 17, (way2newstv.in)
తిరుమలలో వెంకన్న దర్శనానికి ఆర్టీసీ, టీటీడీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ టికెట్లతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కలిగింది. భక్తులు ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, ఆర్టీసీ ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చు. ఒప్పందం ప్రకారం ప్రతి రోజూ వెయ్యి ప్రత్యేక దర్శనం టికెట్లు కేటాయిస్తారు. ఉదయం 11, సాయంత్రం 4 గంటల ప్రత్యేక దర్శనం సమయంలో వెంకన్నను దర్శించుకోవచ్చు. 


ఆర్టీసీ, తిరుమల టై అప్ 

ప్రయాణికులు ఎక్కడి నుంచైనా ఆర్టీసీ, ప్రత్యేక దర్శనం టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రత్యేక దర్శనం టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తాము ఎంచుకున్న టైమ్ స్లాట్ సమయానికి రెండు గంటలు ముందుగా తిరుమల బాలాజీ బస్‌స్టేషన్‌కు గుర్తింపు కార్డు, సంప్రదాయ వస్త్రాలతో వస్తే అందరినీ ఒకేసారి స్వామి దర్శనానికి తీసుకువెళ్తారు. టీటీడీ, ఆర్టీసీ మధ్య కుదిరిన ప్రత్యేక దర్శనం అవగాహనతో భక్తులకు దర్శనానికి ఇబ్బందులు తొలిగిపోయి సులభంగా దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే, ప్రైవేటు బస్సుల్లో తిరుమలకు వెళ్లే వారిని తమవైపు ఆకట్టుకుని సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక దర్శనం, ఆర్టీసీ రిజర్వేషన్ సౌకర్యం కారణంగా తిరుమల వెళ్లాలని భావిస్తున్న భక్తులు సైతం ఇబ్బందులు పడకుండా అన్ని ఒకే సారి పూర్తి చేసుకొని సకాలంలో తిరిగి ఇంటికి చేరుకోవచ్చని వారంటన్నారు. ఆర్టీసీ, టీటీడీ మధ్య కుదిరిన ఒప్పందం భక్తులకు విశేషంగా ఆకర్శిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment