అదిలాబాద్, మే 6, (way2newstv.in)
పంచాయితీ నుంచి మున్సిపాల్టీగా అవతరించింది కానీ... అక్కడి ప్రజలు ఎందుకు మున్సిపాల్టీ అయ్యిందా అను తలలు బాదుకుంటున్నారు... ప్రజల నుంచి మున్సిపాల్టీ అధికారులు ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నా సౌకర్యాల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు.. వాస్తవంగా మున్సిపాల్టీ అయితే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి... అన్ని విషయాల్లో ప్రభుత్వం పంచాయితీల కన్నా మున్సిపాల్టీలకు ప్రాధాన్యత ఎక్కువనిస్తుంది... కానీ మాకు మున్సిపాల్టీ కావడమే పెద్ద శాపంగా మారిందంటున్నారు... స్ధానికులు.మందమర్రి 1995లో థర్డ్ గ్రేడ్ పురపాలక సం ఘంగా మారింది. 52,381 జనాభా, 29,874 ఓటర్లు, 13,709ఇండ్లు ఉన్నాయి. వార్షికాదాయం రూ.82 లక్షలు. అయితే 1993లో గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనే మందమర్రిని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. 1998లో మున్సిపాల్టీ ఎన్నికలకు సైతం సిద్ధమైంది. పలు వార్డులు, ఛైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో దీన్ని సవాలు చేస్తూ ఓ ప్రజాప్రతినిధి కోర్టును ఆశ్రయించారు. గిరిజనులు అధికంగా ఉండే మందమర్రి బల్దియా పదవులను ఎస్టీలకే కేటాయించాలని విన్నవించారు.
మున్సిపాల్టీ కావడమే శాపం...
కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా.. 1998 నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే సగం వార్డులు, చైర్మన్ పదవి ఎస్టీలకే కేటాయించి, ఎన్నికల నిర్వహణ చేపడతామని ప్రభుత్వం ఈయేడు జులైలో ప్రకటించింది. ప్రస్తుతం మందమర్రికి దగ్గ ర్లో అంధుగులపేట, సండ్రోన్‌పల్లి, కోదండ రామాలయం ప్రాంతాలు ఉన్నాయి. నోటిఫైడ్ ఏరియా కావడంతో అధికారులు గ్రామాల విలీనంపై ఎలాం టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న పట్టణం మందమర్రి... మందమర్రి జనాభా విస్తరిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 1995 సంవత్సరంలోనే మందమర్రిని పంచాయితీ నుంచి మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేసింది... అయితే దాదాపు 22 సంవత్సరాల నుంచి మందమర్రి మున్సిపాల్టీకి ఒక్కసారి కూడా ఎన్నికలు జరగకపోవడం విశేషం... ఎన్నికలు నిర్వహించకపోవడంతో మున్సిపాల్టీకి పాలకవర్గం అనేది లేకుండా పోయింది... దీంతో మున్సిపాల్టీగా ఏర్పడినప్పటి నుంచి పాలనా వ్యవస్థ అదుపుతప్పింది.. మందమర్రి ప్రాంతాన్ని ప్రభుత్వం 1993 సంవత్సరంలోనే నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది... మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం 1998లో నోటిఫికేషన్ జారీ అయింది.... ఎన్నికల కోసం నామినేషన్లు కూడా దాఖలయ్యాయి.. ఛైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించారు... కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న మందమర్రి మున్సిపాల్టీలో 1/70 చట్టం అమల్లో ఉన్నందున మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్టీలకు కేటాయించాలంటూ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలయ్యింది... దీంతో అప్పట్లో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీచేసింది...
No comments:
Post a Comment