Breaking News

06/05/2019

డీఎస్సీపై మళ్లీ ఆశలు

అదిలాబాద్,  మే 6, (way2newstv.in)
మరోసారి డీఎస్సీ  ఆశలు మొదలయ్యాయి. టీచర్‌.. మూడక్షరాల పదం. డీఎస్సీ.. ఇదీ మూడక్షరాలే.. వీటి కోసం లక్షలాది కళ్లు ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు డీఎస్సీ వేస్తుందా.. ఎప్పుడెప్పుడు టీచర్‌ జాబ్‌ కొడదామా.. అని ఆశతో ఎదురుచూస్తున్న వారు కనీసం ఇంటికొక్కరు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు డీఎస్సీ గురించి పత్రికల్లో, టీవీల్లో మాట్లాడిన ప్రతీసారి ఇక వస్తుందన్న నమ్మకంతో ఉంటున్నారు. అలా.. చాలాసార్లు భంగపడిన సందర్భాలూ ఉన్నాయి.ఇప్పుడు మరోసారి డీఎస్సీ ప్రస్తావన వచ్చింది. మంత్రే స్వయంగా ప్రకటించడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇలా ఇప్పటికీ చాలాసార్లు ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేయడంతో ఈసారైనా డీఎస్సీ వేస్తారా.. అన్న అనుమానాలూ వేధిస్తున్నాయి. కాగా, చివరిసారిగా డీఎస్సీని 2012లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించారు. అప్పటి నుంచి తెలంగాణలో డీఎస్సీ లేదు. ఈసారైనా కరుణించాలని అభ్యర్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు. 


డీఎస్సీపై మళ్లీ ఆశలు

డీఎస్సీ కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 40 వేలకు పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు అయితే ఇలా ఇప్పటికీ చాలాసార్లు ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేయడంతో ఈసారైనా డీఎస్సీ వేస్తారా.. అన్న అనుమానాలూ వేధిస్తున్నాయి. డీఎస్సీ కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 40 వేలకు పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.ఉపాధ్యాయ పోస్టుల భర్తీని గతంలో విద్యాశాఖ చేపట్టేది. అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన తర్వాత జిల్లాలో డీఎస్సీ(డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ)ల ద్వారా పోస్టులు భర్తీ చేసేది. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఎంపిక బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా టీఎస్‌పీఎస్సీనే నిర్వహిస్తుందని స్పష్టంచేసింది. సాధారణ పరీక్షలకే కఠినమైన నిబంధనలు పెడుతుందన్న పేరున్న టీఎస్‌పీఎస్సీ చేతుల్లోకి డీఎస్సీ వెళ్లడాన్ని అభ్యర్థులు జీర్ణించుకోవడం లేదు.ఉపాధ్యాయ నియామకాల్లో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌) తప్పనిసరి ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొనడంతో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే అమలు చేస్తున్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ లేకుండానే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టెర్ట్‌) పేరిట నిర్వహించారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మళ్లీ టెట్‌ నిర్వహించింది. దీని కాలపరిమితి అయిన ఆరు నెలలు సమయమూ ఎప్పుడో గడిచిపోయింది.ఇక టెట్‌లో అర్హత మార్కులపైనా చాలామంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రన్స్‌ రాసి, బీఈడీ, డీఈడీ శిక్షణను కష్టపడి పూర్తిచేసుకున్నా.. టెట్‌లో ఒక్క మార్కు తక్కువ రావడంతో డీఎస్సీ అర్హత కోల్పోయిన వారెందరో ఉన్నారు. టెట్‌ను పూర్తిగా ఎత్తివేసి డీఎస్సీని నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments:

Post a Comment