హైద్రాబాద్, మే 6, (way2newstv.in)
స్థానిక సంస్థల ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీల నుంచి వచ్చిన వారిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీ చేయిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న వారి కంటే కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించాలని అధినాయకత్వం అయా ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర పార్టీలను పూర్తిగా ఖాళీ చేసేందుకు టీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ ఛైర్మన్‌లను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ యోచిస్తున్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం చేసింది.
32 జెడ్పీ ఛైర్మన్ లే టార్గెట్
దీంట్లో భాగంగానే తొలి, మలి విడతల్లో 2 జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసిన విషయం తెలిసిందే. మూడో విడతలోనూ పలు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు దృష్టి కేంద్రీకరించారు. దీన్నిబట్టి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ మిగతా పార్టీలను ఖాళీ చేసేందుకు పూనుకున్నదని తెలుస్తుంది. ఐదేళ్లు కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు మరింత మెరుగైన వసతులను ప్రతి గడపకు చేరాలంటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కాలని ఆ పార్టీ శ్రేణులు యోచిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపాయం, ప్రతి గ్రామపంచాయతీకి బీటీ రోడ్డు సదుపాయం కల్పించిందని ప్రజలకు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు సర్కారు మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతోనే నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు సాగునీరు తీసుకువచ్చామని చెబుతున్నారు. గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గడపగడపకూ ప్రతి సంక్షేమ పథకం చేరేలా కృషి చేస్తుందని ప్రజల్లో చెబుతున్నారు.
No comments:
Post a Comment