Breaking News

17/05/2019

సాయిబాబా , వరవర రావులను నిర్బంధం నుండి విముక్తి చేయాలి.

తెలంగాణ విద్యార్థి వేదిక
హైదరాబాద్, మే 17 (way2newstv.in)
అక్రమంగా అరెస్టు చేసిన  ప్రొఫెసర్ జి .ఎం. సాయిబాబా ,  రచయితల సంఘ వ్యవస్థాపకుడు వరవరరావు తదితర ప్రజాస్వామికవాదులను  రాజ్య నిర్బంధం నుంచి తక్షణమే విడుదల చేయాలని  తెలంగాణ  విద్యార్థి వేదిక డిమాండ్ చేసింది . ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబెడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి ,  90 శాతం అంగవైకల్యంతో  ఉన్న ప్రొఫెసర్  సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరెస్టు చేసి జైల్లో పెట్టడం అన్యాయం అని అన్నారు. 

సాయిబాబా , వరవర రావులను నిర్బంధం నుండి విముక్తి చేయాలి.

చట్టప్రకారం 90 శాతం అంగవైకల్యం ఉన్న వారిని జైళ్లల్లో పెట్టకూడదని ఐక్యరాజ్యసమితి విడుదల చేయాలని చెబుతున్నప్పటికీ భారత ప్రభుత్వం కనీసం బెయిల్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తన జీవితమంతా తెలంగాణ కోసం కవితలతో , ప్రసంగాలతో ప్రజలను చైతన్య పరిచిన వరవరరావు  నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నాడని ఆయన పై  తప్పుడు ఆరోపణలతో ఎరవాడ జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై  తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని టిఆర్ఎస్  ప్రభుత్వం విడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. అనంతరం ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులకు పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

No comments:

Post a Comment