Breaking News

17/05/2019

సిద్దిపేట చెరువు పై సైకిల్ పై సాహసం...

కోమటి చెరువు పై జిప్ సైక్లింగ్...
మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు కృషి తో కోమటి చెరువు జిప్ సైక్లింగ్ ఏర్పాటు.. 
తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా మన సిద్దిపేట కోమటి చెరువు పైనే ఏర్పాటు.. 
త్వరలో ప్రారంభించనున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, మే 27 (way2newstv.in)
రాష్ట్రానికే రోల్ మోడల్ అయిన మన సిద్దిపేట కోమటి చెరువు పై సిద్దిపేట ప్రజల  కోసం మరింత పర్యాటకాన్ని ఇవ్వనునుంది..మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు  కృషి, చొరవతో కోమటి చెరువు జిప్ సైక్లింగ్ ఏర్పాటు కానుంది... అందుకు పనులు పూర్తి ధశకు చేరుకున్నాయి.. రాష్ట్రంలో ఏ పర్యాటక కేంద్రం అయిన.. ఎక్కడైన సైక్లింగ్ అంటే కింద మాత్రమే ఉంటాయి.


సిద్దిపేట చెరువు పై  సైకిల్ పై సాహసం... 

కాగా చెరువు పై  తెలుగు రాష్ట్రాల్లో తొలి సారిగా మన సిద్దిపేట కోమటి చెరువు పైనే ఈ జిప్ సైక్లింగ్ ఏర్పాటు చేశారు.కోమటి చెరువు  సైక్లింగ్ చేసే వారికి.. పిల్లలకు మరింత పర్యాటక  నెలవుగా మారనుంది.. చెరువు పై సైక్లింగ్ తో ఒక వైపు ఆహ్లదకరం... మరో వైపు ఆరోగ్యం కూడా ఉంటుంది.. త్వరలోనే మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు దీనిని ప్రారంభించనున్నారు.. తొందరలోనే సిద్దిపేట ప్రజలకు,పర్యాటకులకు  ఈ జిప్  సైక్లింగ్ అందుబాటులో కి రానుంది.

No comments:

Post a Comment