Breaking News

08/04/2019

వైసీపీనే బెట్టింగ్ లు

ఏలూరు ఏప్రిల్ 8(way2newstv.com)
దెందులూరు పేరు వినగానే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్…ఆయనతో పాటు బోలెడు వివాదాలు కూడా గుర్తుస్తాయి. అంతలా ఆయన వివాదాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే వివాదాల్లో నెంబర్1 గా ఉన్న అభివృద్ధి, ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆయన ముందే ఉంటారు. ఇక చింతమనేని ప్రతిపక్షాలంటే ఒంటికాలి మీద వెళతారు. దీంతో ఆయన్ని ఎలా అయిన ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అటు వైసీపీ అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరి, ఇటు జనసేన అభ్యర్ధి ఘంటసాల వెంకట లక్ష్మీ చింతమనేని టార్గెట్‌గానే దెందులూరులో ప్రచారం చేస్తున్నారు. ఇక చింతమనేని కూడా ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూనే…తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన చింతమనేని నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే చేశారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా ముందున్నారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కేడర్, అనుచరులు చింతమనేనికి ప్లస్ కానున్నాయి. కానీ దురుసుగా ప్రవర్తించడం…వివాదాల్లో చిక్కుకోవడం వలన ప్రజల్లో ఎక్కువగానే వ్యతిరేకత వచ్చింది. ఇక తనకి ఎప్పుడూ అండగా ఉండే కమ్మ సామాజికవర్గంలో ఈసారి చీలిక కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్ధి కూడా ఇదే వర్గం కావడంతో…చాలావరకు అటు వైపు వెళ్లారు. అయితే చింతమనేనికి మిగిలిన సామాజికవర్గాల్లో మంచి పట్టే ఉంది. 


 వైసీపీనే బెట్టింగ్ లు

కానీ వారు ఎన్నికల్లో ఏ మేర సహకరిస్తారో చూడాలి.ఇక చింత‌మ‌నేనిని ఎలాగైనా ఓడించాల‌ని కసి మీదున్న అబ్బయ్య చౌదరి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. వైసీపీ ఇన్ ఛార్జిగా ఈ ఐదేళ్లు నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల మధ్యలోనే ఉంటూ…చింతమనేని ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడారు. అలాగే ఇంతకాలం చింతమనేనికి మద్ధతు తెలుపుతున్న కమ్మ సామాజికవర్గాన్ని కొంతవరకు తన వైపు తిప్పుకున్నారు. అయితే జనసేన కూడా పోటీలో ఉండటం వలన ఎవరికి నష్టం జరుగుతుందో అర్ధం కాక ఉంది. జనసేన అభ్యర్ధి కూడా చింతమనేనినే టార్గెట్ చేసుకునే ప్రచారం చేస్తున్నారు. మహిళా అభ్యర్ధి కావడం….ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువగా ఉండటం కొంత కలిసొచ్చే అంశం. జనసేనకి ఇక్కడ గెలిచే కెపాసిటీ లేదు గాని ఓట్లు చీల్చే అవకాశం మాత్రం ఉంది. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువుగా ఉన్నాయి. రెండో స్థానంలో ఎస్సీ ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటర్ల‌ ప్రభావం ఎక్కువ. అయితే గత రెండు పర్యాయాలుగా గెలుస్తున్న చింతమనేని గెలుపు ఈసారి అంత సులువు కాదు. ఇక్కడ అబ్బయ్య బలంగా ఉన్నారు. ఈ సారి కమ్మ ఓటర్లు సపోర్ట్ కూడా కొంత ఉంది. అసలు అబ్బయ్య గెలుస్తాడని వైసీపీ శ్రేణులు సవాళ్ళు విసురుతూ..బెట్టింగులు కూడా కట్టడానికి సిద్ధమవుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అని చింతమనేనినీ తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. అయితే ఈ సారి దెందులూరులో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియక ప్రజలు ఫుల్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏదేమైనా చింత‌మ‌నేని దూకుడుకు అబ్బ‌య్య కొంత వ‌ర‌కు బ్రేక్ వేయ‌డంతో ఆయ‌న శిబిరంలో కూడా సీటు టైట్ అయ్యింద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. చింతమనేని హ్యాట్రిక్ కొడతాడో..లేక అబ్బయ్య సత్తా చాటుతాడో… ఈ సారి దెందులూరు ఎవ‌రి ప‌రం అవుతుందో ? చూడాలి.

No comments:

Post a Comment