Breaking News

08/04/2019

టీడీపీ, వైసీపీల మధ్యనే గెలుపు దోబూచులాట

విశాఖపట్టణం, ఏప్రిల్ 8(way2newstv.in)
ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయంగా ఇపుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విభజన ఏపీలో అయిదవ వంతు ఎంపీలు ఇక్కడే ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు ఎక్కువ మంది ఎంపీలు గెలుచుకోవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి నాలుగు ఎంపీలు టీడీపీ గెలుచుకుంటే వైసీపీకి ఒక్క అరకు మాత్రమే దక్కింది. ఈసారి మొత్తానికి మొత్తం గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. టీడీపీ సైతం గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టింది.ఇక విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే అందరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. . టీడీపీ నుంచి దివంగత నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ పోటీలో ఉంటే వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. దాంతో ఈ ఇద్దరు మధ్యనే ప్రధానమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక విజయావకాశాలను బేరీజు వేసినట్లైతే అర్బన్ జిల్లాలో టీడీపీకి కొంత సానుకూల వాతావరణం ఉంది. 


టీడీపీ, వైసీపీల మధ్యనే గెలుపు దోబూచులాట

ఇక్కడ బలమైన అభ్యర్ధులు సిట్టింగులుగా ఉన్నారు. దాంతో ఆ బలం ఎంపీ అభ్యర్ధికి కలసివస్తుందని భావిస్తున్నారు. ఎంపీ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో టీడీపీకి మూడు అనుకూలంగా ఉన్నాయి. విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. వైసీపీ విషయానికి వస్తే భీమునిపట్నం, ఎస్ కోటలలో, విశాఖ దక్షిణంలో సానుకూలత ఉంది. ఇక గాజువాకలో గట్టి పోటీ ఉంది. దీంతో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఏ అసెంబ్లీ సీటు మారుతున్నది చూడాలి.భీమిలీలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయనకు యాభైవేలు మెజారిటీ రావచ్చునని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అది కనుక ఎంపీ అభ్యధికి కూడా టర్న్ అయితే ఎంవీవీ విజయావకాశలు మెరుగుపడతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక టీడీపీకి విశాఖ తూర్పులో ఎక్కువ మెజారిటీ రావచ్చునని అంటున్నారు. మిగిలినవి టైట్ ఫైట్ గా ఉంటాయి. ఇక జనసేన అభ్యర్ధిగా రంగంలో ఉన్న జేడీ లక్ష్మీ నారాయణ ఆశలన్నీ గాజువాక మీదనే ఉన్నాయి. అక్కడ పవన్ విజయంతో పాటు తనకు ఎక్కువ మెజారిటీ తెచ్చిపెడతారని భావిస్తున్నారు. మిగిలిన చోట్ల గట్టి ఎమ్మెల్యేలు లేరు కానీ పవన్ చరిష్మా, బలమైన కాపు సామాజికవర్గం, యువత ఓట్లు, తన వ్యక్తిగత ఇమేజ్ తో గట్తి పోటీ ఇవ్వగలనని ఆయన భావిస్తున్నారు. ఇక పోటీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నామమాత్రమేనని చెప్పాలి మరి. మొత్తానికి చూసుకుంటే సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ, వైసీపీల మధ్యనే గెలుపు దోబూచులాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment