Breaking News

29/04/2019

మారుతోన్న హుస్సేన్ సాగర్

హైద్రాబాద్, ఏప్రిల్ 29, (way2newstv.in)
హుస్సేన్‌సాగర్ నీటిలో ఆక్సీజన్ శాతం పెంచే ప్రక్రియ సత్ఫలితాన్నిస్తున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి విడుదలచేసిన నివేదిక వెల్లడిస్తుంది. మహానగరం నడిమధ్యలో హుస్సేన్‌సాగర్‌ జలాల శుద్ధి కోసం కెనడాకు చెందిన సంస్థ చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటి వరకు సాగర్‌ శుద్ధికి వెచ్చించిన వందల కోట్లు వృథా అయ్యాయి. ప్రతి యేటా వేసవిలో సాగర్‌ నీటి నుంచి వచ్చే తీవ్ర దుర్వాసన సందర్శకులను ఇబ్బందులకు గురి చేసేది. దీంతో సాగర్‌ పరిరక్షణ హెచ్‌ఎండీఏ అధికారులకు పెద్ద సవాలుగా మారేది. ఈసారి కెనడాకు చెందిన ఇజాక్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ సాగర్‌ నీటి శుద్ది కోసం సరికొత్త పరిజ్ఞానాన్ని వాడింది. వేసవిలో ప్రారంభమైన గత ఏడాది జూన్‌ 25 వరకూ 90 రోజులపాటు సాగింది. 3 నెలల ప్రయోగ ఫలితాలను ప్రత్యేకంగా విశ్లేషించారు హెచ్‌ఎండీఏ అధికారులు. నీటిలో ఉండాల్సిన ప్రాణవాయువు శాతం ఆశాజనకంగా ఉందనే సంకేతాలను ప్రస్తుతం నమోదవుతోన్న రికార్డులు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 


మారుతోన్న హుస్సేన్ సాగర్

కరిగిన ఆక్సీజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ హుస్సేన్‌సాగర్ నీటిలో గత నాలుగు రోజులుగా పరీక్షించడం జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. ప్రాణవాయువు నమోదును గుర్తించేందుకు నీటి నమూనాలను సేకరించడం లేదా సాగర్‌లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంకేతిక పరికరాలతో నలుమూలల్లో తనిఖీలుచేసి డిఓ, బిఓడిల నమోదు శాతాన్ని కాలుష్య నియంత్రణమండలి  వెల్లడించింది. ప్రస్తుతం సాగర్‌లోని నీటిలో ఆక్సీజన్ శాతం పగలు రాత్రి సమయాల్లో తేడాలున్నాయి. వాస్తవానికి నీటిలో ప్రాణవాయువు లీటర్‌కు 4-15 మి.గ్రా.లు. ఈ నెల 21 నుండి 24 వరకు నమోదైనది 4.6-13.90 మి.గ్రా.లుగా ఉన్నది. బిఓడి సాధారణంగా లీటర్‌కు 0-3 మి.గ్రా.లు. అయితే, ప్రస్తుతం 20-28 మి.గ్రా.లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడిస్తుంది. నెల రోజులు గడిచాయి… సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి 26న హుస్సేన్‌సాగర్‌లో ఆక్సీజన్ శాతాన్ని పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ కెనడా దేశానికి చెందిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. నెల రోజులు పూర్తయ్యేనాటికి సాగర్ నీటిలో నాచు విపరీతంగా పైకి తేలి, దుర్వాసనలు వస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్సీజన్‌పెంచే కెనడాదేశ సాంకేతిక నిపుణులు ఈ నీటిలో స్వచ్చత రావడానికి, కాలుష్యం తగ్గడానికి, ప్రాణవాయువు పెరగడానికి కనీసంగా 90 రోజుల గడువు కావాలన్నారు. ప్రస్తుతం 30 రోజులు గడిచింది. ఆక్సీజన్ నమోదు పర్వాలేదనేది పిసిబి అధికారుల అభిప్రాయం. మరో 60 రోజులు పూర్తయితేగానీ, ఈ కెనడా సాంకేతికత ప్రయోగ ఫలితాన్ని నిర్ధారించలేమనేది అధికారుల అభిప్రాయం. హుస్సేన్‌సాగర్‌లో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో దుర్వాసనలు వెలువడుతున్నాయి. అయితే, గత ఏడాదికంటే ఈ మారు చాలా తక్కువగా ఘాటైన వాసనల ప్రభావం ఉన్నదని హెచ్‌ఎండిఎ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రతి చెరువు కూడా వేసవిలో ఎండిపోతున్నప్పుడు లేదా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు దుర్వాసనలు సహజమని, హుస్సేన్‌సాగర్‌లో మాత్రం కాలుష్య కారకాలున్నందున మరింత ఘాటుగా వస్తుందని వివరిస్తున్నారు

No comments:

Post a Comment