Breaking News

29/04/2019

దారి మళ్లుతున్న మంజీరా నది

నిజామాబాద్, ఏప్రిల్ 29, (way2newstv.in)
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో మంజీర   నది నుంచి ఇసుక దారి మళ్లుతోంది.  దీంతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ అలజడి కనిపిస్తోంది.నదికి ఆవలి ఒడ్డున గల మహారాష్ట్ర భూభాగంలోని ఎస్గీ క్వారీల్లో నాలుగు రోజుల క్రితం ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి.ఇసుక మాఫియాతో మంజీరా నది ప్రమాదకరంగా మారుతోంది. కాంట్రాక్టర్లు పొందిన అనుమతి కంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. నిబంధనల కు విరుద్ధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వుతున్నారు. దీంతో నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ప్రభుత్వం పట్టాభూముల్లో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. బీర్కూర్ మండలంలోని బీర్కూ ర్, బరంగేడ్గి, బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజీద్‌నగర్, గుండెనెమ్లిల్లో పట్టాభూములనుంచి ఇసుక తరలించడానికి అనుమతి పొందిన కాంట్రాక్టర్లు.. దీనిని ఆసరా చేసుకుంటూ నది లోకి కూడా చొచ్చుకెళుతున్నారు. కూలీల ద్వా రానే ఇసుకను తవ్వాల్సి ఉంది. కాంట్రాక్టర్లు మాత్రం పొక్లెయిన్‌లతో 25నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు. 


దారి మళ్లుతున్న మంజీరా నది

దీంతో నది లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షపు నీటితో ఈ గుంతలు నిండిపోయి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని బండరెం జల్, గుండెనెమ్లి, వాజీద్‌నగర్, పుల్కల్, హస్గు ల్, ఖద్‌గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలంలోని మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం లోని చింతల్‌నాగారం, బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగే డ్గి, కోటగిరి మండలంలోని హంగర్గ, పొతంగ ల్ గ్రామాల్లోన్ని మంజీర తీర ప్రాంతవాసులు ఈ గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.రెండ్రోజుల నుంచి సుమారు 70 నుంచి వంద టిప్పర్లు ఇసుక టిప్పర్లు సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా దూసుకెళ్తున్నాయి. వీటి సంఖ్య త్వరలోనే కొన్ని వందలకు పెరిగే అవకాశముంది. అయితే, ఎస్గీ క్వారీకి ఎదురుగా మన భూభాగంలోని మంజీర నది ఒడ్డున బోధన్‌ మండలంలోని హున్సా, మందర్న, ఖాజాపూర్‌ గ్రామ శివారు ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఇసుక మేటలను మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్లు పలుమార్లు తవ్వేశారు.ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల గ్రామాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి..నిబంధనల మేరకు టిప్పర్లల్లో 10 టన్నుల మేరకు పరిమితి ఉందని అధికారులంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులో ఇసుక టిప్పర్‌కు రూ.500 చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. అయితే, క్వారీ నిర్వాహకులు, ప్రైవేట్‌ వే బ్రిడ్జి వారు ఇచ్చిన రసీదుల ఆధారంగా పన్నులు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలే వాణిజ్యపన్నుల శాఖ ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడే పరిస్థితి నెలకొంది.ఇక, 2015లో మహారాష్ట్ర క్వారీల కాంట్రాక్టర్లు నకిలి వేబిల్లులు సృష్టించి అక్రమ రవాణాకు పాల్పడి మన సర్కారుకు వచ్చే రూ.కోట్ల ఆదాయానికి గండికొట్టారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఓవర్‌లోడ్, నకిలీ వేబిల్లు జారీ నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.అంతరాష్ట్ర సరిహద్దులో ప్రభుత్వం గతేడాది రాష్ట్రంలో పలు చోట్ల టీఎస్‌ఎండీసీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఇసుక రవాణాపై పన్ను విధించింది. ఈ చెక్‌పోస్టుల్లో టన్నుకు రూ.200 చొప్పున పన్ను వసూలు చేయగా రూ.కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఆయా చెక్‌పోస్టుల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలిచి పోయింది. చెక్‌పోస్టులున్నప్పటికీ పన్ను వసూలు చేయడం లేదు. దీనిపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే పైనుంచి ఎలాంటి ఆదేశాలు గానీ, మార్గదర్శకాలు కానీ రాలేదని చెబుతున్నారు.. ఈ బ్రిడ్జి పరిస్థితి దృష్ట్యా గతంలో ఇసుక వాహనాల రాకపోకలను నిషేధించారు 

No comments:

Post a Comment