Breaking News

04/04/2019

ఉత్తమ్ ఒక దొంగ

నల్గోండ, ఏప్రిల్ 3 (way2newstv.in)
నల్గొండ జిల్లా త్రిపురారం లో తెరాస ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీ లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నరసింహా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే  నరసింహమయ్యపాల్గోన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ప్రచార సభ  పెడితే పట్టుమని పది వేల మంది రాలేదు. రాహుల్ సభకు వచ్చిన స్పందన తో టీఆరెస్  విజయం ఎప్పుడో ఖాయం అయిందని అన్నారు. ఈ ఎన్నికల తరువాత గాంధీ భవన్ కు తాళాలు వేసుకోవాల్సిందే. 


ఉత్తమ్ ఒక దొంగ

రాష్ట్రంలో లొనే కాదు దేశం యావత్తు సీఎం కేసీఆర్ నాయకత్వం న్నీ కోరుకుంటుంది. దేశ రాజకీయాల్లో శక్తి గా మారి   దేశానికి మర్గదర్శనం చేసే ఏకైక నాయకుడు మన కేసీఆర్ అని అన్నారు. గ్రామాల్లో పల్లెల్లో ప్రజలంతా కేసీఆర్ వైపే వున్నారు. పార్టీ  అభ్యర్థి వేమీరెడ్డి నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ సొల్లు మాటలు ఆపాలి. వ్యక్తి గతంగా  విమర్శలు మానుకోవాలి. ఉత్తమ్ ని మించిన దొంగ , దోపిడీ దారు ఎవ్వరు లేరని విమర్శించారు. కారు లో కోట్లు రూపాయలను దొంగతనంగా ఎన్నికల్లో పంచడానికి తీసుకెళుతు  దొరికిన  దొంగ ఉత్తమ్. హోసింగ్  మంత్రి గా ఉండి 5 వేల కోట్ల కుంభకోణం చేసిన ఉత్తమ్ తనపై ఆరోపణలు చేయడం సూర్యునిపై ఉమ్ము  వేసినట్లే నని వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment