Breaking News

04/04/2019

అంబికా కృష్ణ వ్యాఖ్యలపై పీతల సుజాత కన్నీరు

ఏలూరు ఏప్రిల్ 3(way2newstv.in)
ఏపీ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెంలో మంగళవారం పర్యటించిన అంబికా కృష్ణ.. పీతల సుజాతకు వ్యతిరేకంగా మాట్లాడారు. సుజాత అహంకారపూరితంగా వ్యవహరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని.. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు ఆమెకు టికెట్‌ నిరాకరించారని అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. 


అంబికా కృష్ణ వ్యాఖ్యలపై పీతల సుజాత కన్నీరు

ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ సుజాత ఏలూరులో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను కావాలనే కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఓ మహిళగా తాను చాలా బాధపడుతున్నారన్నారు. ఈ విషయంలో అంబికా కృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. ఓ దశలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. గత ఐదేళ్లలో చింతలపూడి నియోజకవర్గాన్ని రూ.1800 కోట్లతో అభివృద్ధి చేశానని ఆమె వివరించారు. అంబికా కృష్ణ తనపై చేసిన విమర్శలపై స్థానిక నేతలు అప్పుడే ఆయన్ను నిలదీశారని సుజాత తెలిపారు.

No comments:

Post a Comment