Breaking News

04/04/2019

తప్పు తోవ పట్టిస్తున్న కేసీఆర్

నల్గొండ ఏప్రిల్ 3 (way2newstv.in)
ప్రధాని నరేంద్ర మోడీతో  ముఖ్యమంత్రి కేసీఆర్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  బుధవారం అయన నల్గోండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఫెడరల్ ఫ్ర౦ట్ అంటూ  కొత్త డ్రామాకు తెరలేపారు. ఐదేళ్లలో టీఆర్ఎస్ కు16 ఎంపీల మద్దతు ఉన్నా ఏం సాధించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు వేస్తే వృధా అని అన్నారు. డమ్మీ అభ్యర్థులను పెట్టి పార్లమెంట్ లో ఏం మాట్లాడిస్తారని ప్రశ్నించారు. లోక్ సభ లో తెలుగు దేశం పార్టీ  అవిశ్వాస తీర్మానం పెడితే కేసీఆర్ మోదీ కి సపోర్ట్ చేసిండు. 


తప్పు తోవ పట్టిస్తున్న కేసీఆర్

డీ మానిటైజేషన్ సమయంలో కేసీఆర్ బీజేపీ కి మద్దతు పలికిండు. ఇప్పుడు కేంద్రం మీద ఎన్నికల డ్రామా మొదలు పెట్టిన్రని విమర్శించారు. కేసీఆర్ ,మోదీ రహస్య ఒప్పందం అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజలు గమనించాలి. కేసీఆర్ పదే పదే తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. పదహారు ఎంపీ సీట్లు వస్తే ఏదో సాధిస్తామని చెపుతున్నారు. గత ఐదేళ్లలో పదహారు మంది ఎంపీలు కేసీఆర్ వెంటే నడిచారు. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు.  కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని చెపుతున్నారు. నల్గొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టారు. దొంగ భూములు అమ్మిన వ్యక్తి నల్గొండ టీఆరెస్ ఎంపీ అభ్యర్దిని అయన ఆరోపించారు.  రాహుల్ ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 72 వేల రూపాయలు ఇస్తామని అయన అన్నారు. 

No comments:

Post a Comment